విధి ఎంత విచిత్రమైంది : చనిపోయిన తండ్రి ఫోన్ కి మెసేజ్.. కొన్నాళ్ళ తర్వాత రిప్లై

విధి ఎంత విచిత్రమైంది : చనిపోయిన తండ్రి ఫోన్ కి మెసేజ్.. కొన్నాళ్ళ తర్వాత రిప్లై
x
Highlights

ఇది ఓ సినిమా కథ లాగే అనిపిస్తుంది కానీ నిజ సంఘటన.. నమ్మలేని సంఘటన.. ఓ యువతీ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ ప్రమాదంలో అతని ఫోన్ కూడా పోయింది....

ఇది ఓ సినిమా కథ లాగే అనిపిస్తుంది కానీ నిజ సంఘటన.. నమ్మలేని సంఘటన.. ఓ యువతీ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ ప్రమాదంలో అతని ఫోన్ కూడా పోయింది. కానీ అతని కూతురు మాత్రం తన తండ్రి ఫోన్ కి రోజు మెసేజ్ చేస్తూ ఉంది.. అందులో తన భాదను, తన సంతోషాన్ని, తన జీవితాన్ని, తన ఎదుగుదలని చెబుతుంది. ఇలా ఓ నాలుగు సంవత్సరాల నుండి చేస్తూనే ఉంది. కానీ అక్కడినుండి ఎలాంటి సమాధానం వచ్చేది కాదు. తాజాగా తన తండ్రి చనిపోయిన రోజు అయిన (అక్టోబర్ 25) న కూడా ఎప్పటి లాగే మెసేజ్ చేసింది ఆ కూతురు.. కానీ ఇప్పడు అక్కడినుండి రిప్లై వచ్చింది.. కానీ చేసింది తన తండ్రి కాదు..

ఆ మెసేజ్ లో హాయ్, స్వీట్ హార్ట్ నేను నీ తండ్రిని కాదు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా నువ్వు పంపే మెసేజ్‌లు చూస్తున్నాను. నా పేరు బ్రాడ్... నువ్వు ఎలా అయితే రోడ్డు ప్రమాదంలో నీ తండ్రిని కోల్పోయవో నేను కూడా కారు ప్రమాదంలో నా కూతురును కోల్పోయాను...నువ్వు పంపే మెసేజ్ లో నాకు నా కూతురు కనిపిస్తుంది. నువ్వు పంపే మెసేజ్'లకు రిప్లై ఇద్దామనే అనుకున్నాను కానీ, నీ గుండెను బద్దలు చేయడం నాకు ఇష్టం లేదు. ఒకవేళా నా కూతురు బతికి ఉంటే బహుశా నీలాగే ఉండేదేమో. ప్రతిరోజు నీ అప్‌డేట్స్‌ను పంపుతున్నందుకు ధన్యవాదాలు. దేవుడు నీ రూపంలో మరో కూతురుని నాకు ఇచ్చాడు అని అనుకుంటాను అని రిప్లై ఇచ్చాడు బ్రాడ్.. ఆ అమ్మాయి పేరు ఛాస్టిటీ ప్యాటెర్సన్.. ఆమె తండ్రి పేరు జాసన్ లిగాన్స్..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories