హాట్స్ అఫ్ టీచర్ : ప్రాణాలను పణంగా పెట్టి పాఠాలు చెబుతుంది

హాట్స్ అఫ్ టీచర్ : ప్రాణాలను పణంగా పెట్టి పాఠాలు  చెబుతుంది
x
Highlights

ఈ రోజుల్లో మనం చేయగాలే సహాయం అయిన ఫలితం లేకుండా చేయడం లేదు. కానీ ఓ ఉపాధ్యాయురాలు మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి మరి పాఠాలు చెబుతుంది. ఆమె పేరు...

ఈ రోజుల్లో మనం చేయగాలే సహాయం అయిన ఫలితం లేకుండా చేయడం లేదు. కానీ ఓ ఉపాధ్యాయురాలు మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి మరి పాఠాలు చెబుతుంది. ఆమె పేరు బినోదినీ సామల్... ఆమె ఒడిసాలోని ఢెంకనాల్‌ జిల్లా, హిందోల్‌ బ్లాక్‌లోని జరిపాల్‌ లో ఆమె నివసిస్తుంది . అక్కిడి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా రతియాపల్‌ అనే గ్రామంలో ఓ కాంట్రాక్ట్‌ టీచర్ గా పని చేస్తుంది . ఆమె అ ఊరికి వెళ్లి పాఠాలు చెప్పడం అంటే బస్సులోనో ,బైక్ లోనో వెళ్ళడం కాదు .. ఓ నదిని ఈదుకుంటూ వెళ్లి మరి పాఠలు చెప్పాలి . ఉదయం, సాయంత్రం రోజూ రెండు సార్లు ఆ గట్టుకు ఈ గట్టుకు ఈదితేనే అక్కడ పిల్లలు నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు .

నిజానికి ఆమె చేస్తున్నది పెద్ద సాహసమే అని చెప్పాలి . ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఆమె అందులో నుండి కొట్టుకొని పోవడానికి నిమిషం చాలు... కానీ ఆమెకు అవేవీ లెక్కలేదు. రోజు పిల్లలకు పాఠాలు చెప్పడం తప్ప ... ఆమె నదిలో ఈదడానికి ముందు తనకి సంబంధించిన వస్తువులు తడవకుండా ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి బ్యాగ్‌లో పెట్టుకుంటుంది . నీటిలో బ్యాగ్‌ తడవకుండా పైకి పట్టుకొని నదిని ఈదుతుంది. స్కూల్‌కు వెళ్లాక తడిసిన దుస్తులను మార్చుకొని పిల్లలకు పాఠాలు చెబుతుంది .. ఇంత చేస్తున్నా ఆమెకి వచ్చేది మాత్రం ఏడూ వెయిల జీతం మాత్రమే..

నిజానికి ఆమెకి 8 ఏళ్ల క్రితం ఉద్యోగం పర్మినెంట్‌ కావాల్సి ఉంది కానీ కాలేదు. ఒక వేల అయి ఉంటే మాత్రం 27 వేల రూపాయల జీతం వచ్చేది. ప్రస్తుతం ఆమె ఆమె నదిని ఈదుతోన్న ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్‌ ఆ ఊరుకు వంతెన కట్టిస్తామంటున్నారు. తన వల్ల ఆ ఊరుకు బ్రిడ్జి అయినా వస్తోందని ఆమె చాలా సంతోషిస్తున్నారు. ఎలాంటి ఫలితం లేకుండా పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఆమె సంకల్పానికి హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పండి .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories