A Tailwind Looming toward the surface of the earth: ఆకాశంలో అద్భుతం..భూమివైపు కొత్త తోకచుక్క...

A Tailwind Looming toward the surface of the earth: సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే.
A Tailwind Looming toward the surface of the earth: సౌరకుటుంబం లోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. అయితే ఈ భూమి చుట్టూ ప్రతి నిత్యం తోకచుక్కలూ, గ్రహ శకలాలూ తిరుగుతూనే ఉంటాయి. వాటిలో 95 శాతం మన కళ్లకు కనిపించవు. అలాంటిది తోకచుక్కల్లో ఈమధ్యే కనిపెట్టిన నియోవైజ్ అనే తోకచుక్క మాత్రం...ఇప్పుడు భూమికి దగ్గర నుంచి వెళ్లబోతూ...మన కళ్లకు కనిపించనుంది. అయితే ఈ తోకచుక్క ఈ మధ్య కాలంలోనే అంటే బుధగ్రహం కక్ష్యను దాటింది. అంతే కాదు ఈ తోకచుక్క ఈ జులై రెండో వారంలో భూమిపై నుంచి వెళ్లనుంది. ఎప్పుడైతే అది భూమిపై నుంచి వెళుతుందో అది మన కళ్లకు క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) తెలిపింది. అది దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, అది భూమిపై ప్రయాణించే సమయంలో దాని తోకను కూడా మనం చూడొచ్చుని తెలిపారు.
అయితే ఈ తోకచుక్కను అధికారికంగా C/2020 F3 అని పిలుస్తారు. దీన్ని నాసా నియోవైజ్ (NEOWISE) శాటిలైజ్ కనిపెట్టింది. సానా ఈ తోకచుక్కను కనిపెట్టిన సమయంలో అది సూర్యుడికి చేరువవుతూ శాటిలైట్ లో కనిపించింది. అయితే అది చూసిన పరిశోధనా సంస్థ వారు సూర్యుడి వేడి వల్ల తోకచుక్క పని అయిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ తోకచుక్క సూర్యుడివైపునుకు వెళ్లకుండా దారిని మళ్లించుకుని వచ్చే వారం నుంచి భూమివైపు పయనించబోతోంది. దాంతో ఆ తోకచుక్కఈ నెలంతా ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది. ఏ రోజైనా మేఘాలు అడ్డొస్తే... తర్వాతి రోజు గమనించండి.
అయితే ఇది ఏయే వేళల్లో కనిపిస్తుందంటే ప్రతి రోజు రాత్రి వేళ... ఉత్తరం వైపున ఆకాశంలో సూర్యాస్తమయం తర్వాత ఇది కనిపించనుంది. ఆ తరువాత మళ్లీ సూర్యుడు ఉదయించడానికి ముందు కనిపిస్తుంది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చూడలేదు. కేవలం బైనాక్యులర్ ఉన్న వారు మాత్రమే ఇది చూడగలరు. ఈ నెల మొత్తం వీక్షకుల్ని కనువిందు చేసి ఆగస్టులో నెలలో క్రమంగా కనుమరుగవుతుంది. నాసా శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమ గాములూ... ఈ తోకచుక్కను పరిశోధిస్తున్నారు. ఈసారి దాన్ని కళ్లారా చూడటం ద్వారా... మనమూ దాన్ని పరిశీలించవచ్చు.
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
Vishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMTగోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు
9 Aug 2022 11:49 AM GMTఆ అభిమానంతోనే 'నారప్ప' చేయలేదన్న దర్శకుడు హను రాఘవపూడి
9 Aug 2022 11:30 AM GMT