Viral Video: పామును భలే పట్టేశాడే.. ఈ వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ముఖ్యంగా ఇంట్లోకి వచ్చిన పామును పట్టించేందుకు పాములను పట్టే వారిని పిలిపిస్తుంటారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 22 Sept 2024 6:30 PM IST
A snake catcher caught snake with brave video goes viral in social media
X

Viral Video: పామును భలే పట్టేశాడే.. ఈ వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.. 

వాతావరణంలో ఏమాత్రం మార్పు వచ్చినా వెంటనే పాములు దర్శనమిస్తుంటాయి. వాతావరణం వేడెక్కినా, చల్లబడినా ఎక్కడెక్కడో నక్కిన పాములు సైతం బయటకు వచ్చేస్తాయి. అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసల్లోకి వస్తే ఏమన్న ఉంటుందా.? భయంతో ప్రజలు పరుగులు పెట్టే పరిస్థితి.

ముఖ్యంగా ఇంట్లోకి వచ్చిన పామును పట్టించేందుకు పాములను పట్టే వారిని పిలిపిస్తుంటారు. పాము కనిపించగానే భయపడి పారిపోతుంటాయి. అయితే పాములు పట్టే వారు మాత్రం ఎంతో సింపుల్‌గా ధైర్యంగా వాటిని ఇట్టే పట్టేసుకుంటారు. వీళ్లు పాములను పట్టుకునే సమయంలో చూపించే ధైర్యం వావ్‌ అనిపించేలా ఉంటుంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

నర్పత్‌ నాయక్‌ అనే వ్యక్తికి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే ప్రజల మధ్యలోకి వచ్చిన ఒక బ్లాక్‌ కోబ్రాను నర్పత్ నాయక్‌ ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. రాయి కింద నక్కిన పామును బయటకు తీశాడు. ఆ తర్వాత తన చేతితో సైగలు చేస్తూ.. పామును నెమ్మదిగా ఒక ట్రాప్‌లోకి తీసుకెళ్లి తలను పట్టేసుకున్నాడు. అనంతరం పామును తనతో తీసుకెళ్లిపోయాడు.

దీనంతటినీ అక్కడే ఉన్న వారు స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. నిజంగా అతని ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ఈ వీడియోను చూసేయండి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story