Viral Video: నీ రీల్స్ పిచ్చి తగలెయ్యా.. తిట్టి పోస్తున్న నెటిజెన్లు..!

Viral Video: ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో.. ప్రతి ఒక్కరూ పాపులర్ అవ్వాలని ఆశ పడుతున్నారు.

A Mother did Risky Reel Beside Well With her Daughter Videos Goes Viral
X

Viral Video: నీ రీల్స్ పిచ్చి తగలెయ్యా.. తిట్టి పోస్తున్న నెటిజెన్లు..!

Viral Video: ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో.. ప్రతి ఒక్కరూ పాపులర్ అవ్వాలని ఆశ పడుతున్నారు. ఏది చేసైనా సరే క్రేజ్ సంపాదించుకోవాలి, నెట్టింట వైరల్ అవ్వాలి ఇప్పుడు చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నారు. రకరకాల ఫీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నావు వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ తల్లి తనబిడ్డను బావిమీద కూర్చుండబెట్టి చేసిన పని వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు తిట్టిపోస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన బిడ్డతో కలిసి బావి పక్కన కూర్చుంది. మామూలుగా రీల్ చేస్తే ఎవరు చూస్తారు అనుకుందో ఏమో కానీ.. చేతిలో ఉన్న చిన్నారిని బావిలోకి పడేస్తున్నట్లు రీల్ చేసింది. బావికి మరోవైపు ఉన్న వ్యక్తి స్మార్ట్ ఫోన్ లో ఆ వీడియోను చిత్రీకరించారు. ఇంకేముంది ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు సదరు మహిళపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. లైక్స్ కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఏది ఏమైనా ఈ సోషల్ మీడియా పిచ్చి ఇంకెంత దూరం వెళుతుందో అన్న సందేహం రాక మానదు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story