లేడీ కానిస్టేబుల్ కి లవ్ ప్రపోజ్ .. పాపం సీన్ రివర్స్

లేడీ కానిస్టేబుల్ కి లవ్ ప్రపోజ్ .. పాపం సీన్ రివర్స్
x
Highlights

ఈ విషయం ఇంట్లో చెప్పే వచ్చానని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు .. మాటలతో చెబితే వినేలా లేడు అని చొక్కా పట్టుకుని స్టేషన్‌కు నడువమన్నది. ఇక చివరికి పరిస్థితి పీక్స్ కి వెళ్లడంతో ఆ యువకుడు అసలు విషయం చెప్పేసాడు..

పోలీసులు కనిపిస్తేనే ఏం తప్పు చేయకున్నా ఓ రకంగా మనకి భయం అవుతుంది ... ఇక మాట్లాడడం అంటే నిజంగా డేర్ ఉండాలనే చెప్పాలి .. కానీ మనోడు ఏకంగా ఓ లేడి కానిస్టేబుల్ కే ప్రపోజ్ చేసాడు. మిమ్మల్ని మూడు నెలల నుండి ప్రేమిస్తున్నాని, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. గత కొద్దిరోజులుగా మీకు ఈ విషయం చెబుదాం అని అనుకుంటున్నాను, కానీ మీరు నాకంటే పెద్ద మళ్ళీ పోలీసు వృత్తిలో ఉన్నారు అందుకే కొంచం భయం వేసింది అని చెప్పుకొచ్చాడు..

దానికి ఆమె సమాధానం ఇస్తూ నీ వయసు ఏంటి నా వయసు ఏంటి అని అంది. నిజమైన ప్రేమకి వయసుతో సంబంధం లేదు.. నేను ఇలా ప్రపోజ్ చేయడం తప్పు కావచ్చు కానీ నా ప్రేమ తప్పు కాదు అని ఓ భారీ సినిమా డైలాగ్ కొట్టి కన్విన్స్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఆమె వినలేదు కదా.. విసుగు తెచ్చుకుంది. బుద్దిగా చదువుకోక ఇవేమీ పనులను హెచ్చరించింది. అయినా ఆమె మాటలు లెక్క చేయలేదు ఆ యువకుడు .. ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ మళ్లీ విసిగించడం మొదలు పెట్టాడు.

దీనితో సదరు కానిస్టేబుల్ కి మరింత చిరాకు లేసింది.నేను ఎవరో తెలుసాగా అని అడిగింది. తెలుసు మీరు ఇక్కడే పీఎస్ లో వర్క్ చేస్తారని తనకు తెలుసన్నాడు.. మీరంటే నాకు చాలా ఇష్టమని ఒక్కసారి చెప్పేది వినమని బ్రతిమిలాడడు.. . పో వెళ్లి చదువుకో పో, నీకు నాకు సెట్ కాదు ఎక్కువ మాట్లాడితే స్టేషన్ కి తీసుకెళ్తా గట్టిగానే మందలించింది. ఆలా ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదమే జరిగింది. ఇక ఓపిక నశించిన కానిస్టేబుల్ మీ అమ్మ నాన్న నెంబర్ ఇవ్వు అని అడిగింది.

ఈ విషయం ఇంట్లో చెప్పే వచ్చానని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు .. మాటలతో చెబితే వినేలా లేడు అని చొక్కా పట్టుకుని స్టేషన్‌కు నడువమన్నది. ఇక చివరికి పరిస్థితి పీక్స్ కి వెళ్లడంతో ఆ యువకుడు అసలు విషయం చెప్పేసాడు.. ఇప్పటిదాకా చేసిందంతా ప్రాంక్ వీడియోలో భాగమని చెప్పాడు. హర్ష అనే యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ అజయ్ చేసే ప్రాంక్ వీడియోస్ నచ్చడంతో తన కజిన్ మీద కూడా ఇలా ప్రాంక్ చేయించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories