Viral Video: పకోడీలను గులాబీతో చేయకూడదా ఏంటీ.? వైరల్‌ అవుతోన్న వీడియో.. !

Viral Video: అసలే వర్షాకాలం, వాతావరణం చల్లగా మారింది. ఇలాంటి సమయంలో వేడి వేడి పకోడి తింటే ఉంటుందీ.. ఊహించుకుంటేనే నోరు ఊరిపోతోంది కదూ!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 28 July 2024 7:01 PM IST
A Man Making Rose Pakoda Video Goes Viral in Social Media
X

Viral Video: పకోడీలను గులాబీతో చేయకూడదా ఏంటీ.? వైరల్‌ అవుతోన్న వీడియో.. !

Viral Video: అసలే వర్షాకాలం, వాతావరణం చల్లగా మారింది. ఇలాంటి సమయంలో వేడి వేడి పకోడి తింటే ఉంటుందీ.. ఊహించుకుంటేనే నోరు ఊరిపోతోంది కదూ! అయితే పకోడి వేటితో చేసుకుంటారు చెప్పండి. ఏముంది.. ఉల్లిపాయ లేదా క్యాబేజీ, మరీ అంటే గోబీతో చేస్తారు అంటారా.? సహజంగా మనలో చాలా మందికి తెలిసిన పకోడిలు కూడా ఇవే. అయితే గులాబీతో పకోడిలు చేసుకుంటే ఎలా ఉంటుంది. గులాబీతో పకోడి ఏంటని మొహం తిప్పుకుంటున్నారు కదూ! కానీ ఇప్పుడు ఈ గులాబీ పకోడి వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటే ఇదేనేమో. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు. పకోడికి అర్థాన్ని మార్చేస్తూ ఓ వ్యక్తి గులాబీలతో పకోడి చేస్తున్నాడు. అయితే ఏదో ఇంట్లో సరదాగా చేసుకుంటున్నాడంటే పొరబడినట్లే. ఎంచక్కా బండిపై చేసిన అమ్ముతుంటే ప్రజలు క్యూలో నిలబడి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు.

ఇందుకోసం ఆ వ్యక్తి ఎర్రటి గులాబీ కాడలను నీట్‌గా కట్ చేశాడు. అనంతరం అచ్చంగా పకోడి కోసం రడీ చేసుకున్నట్లుగానే శనగపిండిలో కారం, ఉప్పుతో పాటు కావాల్సిన అన్ని వస్తువులను వేశాడు. అనంతరం నీటిని పోసి పిండిన రడీ చేసుకున్నాడు. ఇంకేముంది అంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న గులాబీలను ఒక్కొక్కటి పిండిలో ముంచుతూ వేడి వేడి నూనెలో వేయించాడు. వెంటనే ప్లేట్‌లో వేసి ఇవ్వడంతో అప్పటికే ఎదురు చూస్తున్న కస్టమర్స్‌ లొట్టలేసుకొని తింటున్నారు. దీనతంటినీ వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో తెగ్ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు గులాబీతో పకోడి ఏంటి బాబూ అంటూంటే మరికొందరు మాత్రం, గులాబీ పువ్వు ఆరోగ్యానికి ఎలాగో మంచిది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story