Viral Video: బురదలో చిక్కుకున్న చిన్నారి గజరాజ.. తల్లడిల్లిన తల్లి గజరాజ.. చివరికి ఏమైందంటే..?

Viral Video: Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.

Sandeep Eggoju
Updated on: 14 Nov 2021 6:04 PM IST
A Baby Elephant Trapped in the Mud Viral Video
X

బురదలో చిక్కుకున్న ఏనుగు పిల్ల వైరల్ వీడియో (ట్విట్టర్ ఇమేజ్)

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువుల కంటెంట్‌ని నెటజన్లు ఉత్సాహంగా చూస్తారు. ఎందుకంటే ఈ వీడియోలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అందుకే జంతువులకి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తొందరగా వైరల్‌ అవుతాయి. తాజాగా ఒక ఏనుగుకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు గొప్పతనం గురించి చెబుతూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

ఒక బురద ఉన్న గొయ్యిలో చిన్నారి ఏనుగు చిక్కుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. అయితే అంతకుముందే ఏనుగుల ఫ్యామిలీ కలిసి ఆ మడుగులో సేదతీరాయి. కొద్దిసేపటికి అన్ని ఏనుగులు బురద నుంచి నేలపైకి వచ్చాయి. కానీ ఒక పిల్ల ఏనుగు మాత్రం ఆ గొయ్యి నుంచి బయటికి రాలేకపోతుంది. కారణం దాని కాళ్లు చిన్నగా ఉండటం వల్ల అది పైకి ఎక్కలేకపోతుంది. ఇది గమనించిన తల్లి ఏనుగు తల్లడిల్లిపోతుంది. ఎలాగైన పిల్ల ఏనుగుని బయటికి తీసుకరావడానికి ప్రయత్నించడం మనం వీడియోలో గమనించవచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ సంఘటనని పక్కన ఉన్న మరో ఏనుగు గమనించి తల్లి ఏనుగుకి సాయం చేస్తుంది. రెండు కలిసి పిల్ల ఏనుగుని ఎలాగోలా గుంట నుంచి బయటికి లాగుతాయి. అనంతరం అక్కడి నుంచి పరుగులు పెడుతాయి.

వీడియో చూసిన నెటిజన్లు తల్లి ఏనుగు సాహసానికి ఫిదా అవుతున్నారు. ఏనుగు తెలివిని పొగడుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా స్పందించాడు. 'ఈ వీడియో హృదయానికి హత్తుకునే వీడియో' అని రాశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. ఏనుగు జ్ఞానం నా హృదయాన్ని గెలుచుకుందని మరొక వినియోగదారు ప్రశంసించారు. ఇంకొకరు ఏనుగును భూమిపై అత్యంత తెలివైన జీవి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకున్నానని రాశారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే మీ స్పందనను తెలియజేయండి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story