Plesiosaur: 183 మిలియ‌న్ ఏళ్ల నాటి జీవి అవ‌శేషాలు గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లు

Plesiosaur
x

Plesiosaur: 183 మిలియ‌న్ ఏళ్ల నాటి జీవి అవ‌శేషాలు గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లు

Highlights

Plesiosaur: జర్మనీలో శాస్త్రవేత్తలు అరుదైన‌ ప్లెసియోసార్ (Plesiosaur) ఫాసిల్‌ను కనుగొన్నారు. ఈ సముద్ర జీవి దాదాపు 183 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. దీనిలో చర్మం, త్వచా, కెరటిన్ వంటి భాగాలు సహా సజీవంగా ఉన్నట్టు భావించే స్థాయిలో దొరికాయి.

Plesiosaur: జర్మనీలో శాస్త్రవేత్తలు అరుదైన‌ ప్లెసియోసార్ (Plesiosaur) ఫాసిల్‌ను కనుగొన్నారు. ఈ సముద్ర జీవి దాదాపు 183 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించింది. దీనిలో చర్మం, త్వచా, కెరటిన్ వంటి భాగాలు సహా సజీవంగా ఉన్నట్టు భావించే స్థాయిలో దొరికాయి. ఇలాంటివి సాధారణంగా సముద్ర జంతువుల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి.

1940లో లభించినా ఇప్పుడే పూర్తిగా అధ్యయనం

ఈ MH 7 అనే ఫాసిల్ 1940లో జర్మనీలోని హోల్జ్‌మాడెన్ వద్ద దొరికింది. అయితే దీనిని దాదాపు 80 సంవత్సరాల పాటు ప‌క్క‌న పెట్టేశారు. 2020లో శాస్త్రవేత్తలు దాన్ని శుద్ధి చేయడం మొదలుపెట్టినప్పుడు, ఇందులో అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు.

ఫ్లిప్పర్ల భాగంలో బీటా-కెరటిన్‌తో కూడిన త్రికోణాకారపు చిన్న చిన్న శల్యాలు (scales) కనిపించాయి. ఇవి నీటిలో సులభంగా, ఖచ్చితంగా కదలడానికి ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు తోక భాగంలో స్మూత్ స్కిన్ ఉండటంతో అది వేరే విధంగా పనిచేసినట్టు అర్థమవుతోంది.

ఈ ఫాసిల్ తోకచర్మంలో మెలనోసోమ్స్ అనే రంగును ఇచ్చే సూక్ష్మ కణాలను గుర్తించారు. దీని ద్వారా ప్లెసియోసార్‌కు ఒకే రకమైన రంగు కాకుండా రంగు మోతాదులు లేదా నమూనాలు ఉండేవని అంచనా. ఈ అవ‌శేషంలో తోక ఫిన్ కూడా గుర్తించారు. ఇది జీవికి నీటిలో వేగంగా ఈదేందుకు లేదా దిశ మారుస్తూ సునాయాసంగా కదలేందుకు సహాయపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.



ఫాసిల్ దొరికిన ప్రాంతమైన Posidonia Shaleలో తక్కువ ఆక్సిజన్‌తో ఉండటంతో సాఫ్ట్‌ భాగాలు కూడా డికంపోజ్ కాకుండా శాశ్వతంగా ఉండిపోయాయి. అందుకే ఈ MH 7 ఫాసిల్ అంత అద్భుతంగా భద్రంగా దొరికిందని భావిస్తున్నారు.



ఈ విష‌య‌మై ప్ర‌ధాన ప‌రిశోధ‌కుడు మిగ్వెల్ మార్క్స్ మాట్లాడుతూ.. “183 మిలియన్ల సంవత్సరాల చర్మ కణాలను నేరుగా మైక్రోస్కోప్లో చూడగలగటం అద్భుతం. ఇది ఆధునిక చర్మాన్ని చూసిన అనుభూతిని కలిగించింది,” అని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories