

Eluru: సత్యసాయిబాబా జయంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పార్థసారథి
కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం,ఆధ్యాత్మిక మార్గదర్శి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.సత్యసాయిబాబా జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


Indrakeeladri: భక్తుల సేవలో నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేయాలి
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు మెరుగైన సేవలు అందించడం మరియు విధి నిర్వహణలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో సోమవారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి మహామండపం 4వ అంతస్తు సమావేశం హాల్‌లో దేవస్థానం సిబ్బందితో కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


Peddakalvala: పెద్దకాల్వలను పెద్దపల్లి పాక్స్ పరిధిలోనే కొనసాగించాలి: రైతుల వినతి!
పెద్దకాల్వల గ్రామాన్ని 20 కి.మీ దూరంలోని తురుకల మద్దికుంట సొసైటీలో కాకుండా గతంలోలాగే 3 కి.మీ దూరంలోని పెద్దపల్లి పాక్స్ పరిధిలో కొనసాగించాలని, లేదంటే గ్రామంలోనే ప్రత్యేక పాక్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.


Wanaparthy: వనపర్తి ఎస్పీ సునిత రెడ్డిని కలిసిన ప్రొబేషనరీ డీఎస్పీలు!
వనపర్తి జిల్లాలో ఆరు నెలల క్షేత్రస్థాయి శిక్షణకు కేటాయించబడిన ప్రొబేషనరీ డీఎస్పీలు చింత రాహుల్, పాపినేని అఖిల్, శివరాజ్ పబ్బా సోమవారం జిల్లా ఎస్పీ సునిత రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 24 వారాల శిక్షణను సమర్థవంతంగా వినియోగించుకుని నేర నియంత్రణ, దర్యాప్తు, శాంతిభద్రతలపై ప్రత్యక్ష అనుభవం పొందాలని ఎస్పీ సూచించారు.


Wanaparthy: నవంబర్ 26న వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ పర్యటన!
నవంబర్ 26న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు డీఆర్డీఓ పీడీ ఉమాదేవి సోమవారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి రేషన్ షాపులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలను తనిఖీ చేసి, మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీలో సమీక్ష నిర్వహిస్తారు.


Sangareddy: కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్!
కార్తీకమాసం సందర్భంగా సంగారెడ్డిలో మాజీ కౌన్సిలర్ కసిని శ్రీకాంత్ నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన రుద్రాభిషేకం, రుద్ర హోమం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సోమవారం పాల్గొన్నారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.


రైలులో ఖాళీ సీటు ఉంటే టికెట్ మీదే.. 10 గంటల ముందు ఎలా బుక్ చేసుకోవాలంటే?
రైలు ప్రయాణానికి కన్ఫర్మ్ టికెట్ దొరకలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కరెంట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైలు చార్టు తయారైన తర్వాత మిగిలిన ఖాళీ సీట్లపై ఈ టికెట్ బుక్ అవుతుంది.


Sirikonda: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలేవి? సుజాత ఆగ్రహం!
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరికొండలోని సర్వే నంబర్ 127లో తీర్మానం లేకుండానే ఐదుగురు అక్రమ పట్టాలు పొందారని, సర్వే నంబర్ 120లో ఉపాధి హామీ నిధులు రూ.46 వేలకు పైగా బిల్లులు పొందారని గ్రామానికి చెందిన సుజాత ఆరోపించారు. ప్రొసీడింగ్స్ జారీ అయినా భూమిని స్వాధీనం చేసుకోవడం లేదని, అక్రమ పట్టాలు రద్దు చేసి నిధులు రికవరీ చేయాలని కోరారు.


Dornakal: రూ.800 కోట్లతో డోర్నకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే!
డోర్నకల్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి నూతన పీహెచ్‌సీ, మహిళా సమాఖ్య భవనాన్ని సోమవారం ప్రారంభించారు. సీరోల్ మండలంలోనే రూ.37 కోట్ల పనులు చేశామన్నారు.


Sircilla: ఇంటర్మీడియట్ రద్దు ఆలోచనపై ప్రభుత్వం పునరాలోచించాలి: రవి గౌడ్!
ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలనే ప్రభుత్వ ఆలోచనపై రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు ఇది పునాది అని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని కోరారు.


బాహుబలి వేషాలు వద్దు.. బీహార్ జడ్జికి సుప్రీంకోర్టు చురకలు.!
చట్టాన్ని కాపాడాల్సిన చోట కొందరు న్యాయాధికారులు సినిమా బాహుబలిలాగా దూకుడు ప్రదర్శిస్తే ఎలా అని సుప్రీంకోర్టు గట్టిగా చురకలంటించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్న కారణంతో పోలీసు అధికారిని పిలిపించి, అదే రోజు దోషిగా తేల్చి జరిమానా వేసిన బీహార్ సెషన్స్ జడ్జి తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ చేసిన వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


Narayanpet: మాతృ మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ!
మాతృ మరణాల నివారణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నారాయణపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. జయచంద్ర మోహన్ ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి పర్యవేక్షించాలని, టెరిషరి ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు.