జైపూర్‌కు షాక్ ఇచ్చిన తెలుగు టైటాన్స్‌.. అదరగొట్టిన విశాల్‌

జైపూర్‌కు షాక్ ఇచ్చిన తెలుగు టైటాన్స్‌.. అదరగొట్టిన విశాల్‌
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో విజయాన్ని సోంతం చేసుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో విజయాన్ని సోంతం చేసుకుంది. దిల్లీ వేదికగా నిన్న(శనివారం) జరిగిన మ్యాచ్‌లో టేబుల్‌ టాపర్‌ జైపూర్‌కు జలక్ ఇచ్చింది. చివరి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన హోరాహోరి పోరులో తెలుగు టైటాన్స్ 24–21తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. రైడర్ సిద్ధార్థ దేశాయ్ 3 పాయింట్లతో నిరాశపరిచినా.. డిఫెండర్ విశాల్ భరద్వాజ్ 8 పాయింట్లతో సత్తాచాటాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కు ఇది మూడో విజయం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి ఎగబాకింది. ఇక మరో మ్యాచ్‌లో దబాంగ్‌ ఢిల్లీ 33-31తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. నేటి మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్‌ - యూపీ యోధతో దబంగ్‌ ఢిల్లీ ఆడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories