యు ముంబాపై తమిళ్ తలైవాస్ ఘోర ఓటమి

యు ముంబాపై తమిళ్ తలైవాస్ ఘోర ఓటమి
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పంచకుల వేదికగా జరిగిన మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ యు ముంబా చేతిలో 32-36 తేడాతో పేలవంగా ఓడింది. తమిళ్ తలైవాస్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి నిరాశపరిచాడు.

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పంచకుల వేదికగా జరిగిన మ్యాచ్ లో తమిళ్ తలైవాస్ యు ముంబా చేతిలో 32-36 తేడాతో పేలవంగా ఓడింది. తమిళ్ తలైవాస్ జట్టులో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి నిరాశపరిచాడు. మరో రైడర్ అజిత్ కుమార్ కాస్త ఆకట్టుకున్నాడు.యు ముంబా జట్టులో రైడర్ అభిషేక్ సింగ్ 10 పాయింట్లు సాధించాడు. తమిళ్ తలైవాస్ 20వ మ్యాచ్ లు ఆడి 14వ ఓటమితో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 42 -33 తేడాతో బెంగాల్ వారియర్స్ విజయాన్ని అందుకుంది. ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్న ఈ రెండు జట్లు అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయి.

పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ (82) పాయింట్లు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ‎ బెంగాల్ వారియర్స్ (78), హర్యానా స్టీలర్స్ (65) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రేసులో యు ముంబా , బెంగుళూరు బుల్స్ , యూపీ యోధా ఉన్నాయి. ఇక తెలుగు టైటాన్స్ జట్టు 39 పాయింట్లతో పట్టికలో 11వ స్థానంలో నిలిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories