ప్రోకబడ్డీ: రసవత్తర పోరులో పునేరీ పల్టాన్ విజయం

ప్రోకబడ్డీ: రసవత్తర పోరులో పునేరీ పల్టాన్ విజయం
x
Highlights

ప్రోకబడ్డీ లీగ్ లో భాగంగా సోమవారం గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ పై పునేరీ పల్టాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. హోరా హోరీగా సాగిన పోరులో...

ప్రోకబడ్డీ లీగ్ లో భాగంగా సోమవారం గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ పై పునేరీ పల్టాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. హోరా హోరీగా సాగిన పోరులో పూనేరీ జట్టు గుజరాత్ జట్టుపై రెండు పాయింట్ల తేడాతో విజయభేరి మోగించింది. పునేరీ పల్టాన్ కు ఈ సీజన్ లో ఇది రెండో విజయం. గుజరాత్ జట్టులో రైదర్ సచిన్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. దీంతో ఆ జట్టు మొత్తం 31 పాయింట్లు సాధించగలిగింది. అయితే, పూనా జట్టులో పవన్, అమిత్ లు అద్భుతంగా రానించడంతో 33 పాయింట్లు సాధించి రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక సోమవారం జరిగిన మరోమ్యాచ్ లో జైపూర్ జైత్రయాత్రకు ధిల్లీ జట్టు కళ్ళెం వేసింది. 35 పాయింట్లు సాధించిన డిల్లీ దబాంగ్స్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ ను 24 పాయింట్లకు కట్టడి చేసి 11 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories