ప్రోకబడ్డీ: జైపూర్ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన యూపీ

ప్రోకబడ్డీ: జైపూర్ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన యూపీ
x
Highlights

ప్రోకబడ్డీ సీజన్ 7లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జైపూర్ పింక్ పాంథర్స్ జైత్రయాత్రకు యూపీ యోధ అడ్డుకట్ట వేసింది. చెన్నైలో జరుగుతున్న ప్రోకబడ్డీ లీగ్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో యూపీ జట్టు జైపూర్ జట్టుపై విజయం సాధించింది. మరో మ్యాచ్ లో యు ముంబా పై హర్యానా స్టీలర్స్ గెలుపొందింది.

ప్రోకబడ్డీ సీజన్ 7లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జైపూర్ పింక్ పాంథర్స్ జైత్రయాత్రకు యూపీ యోధ అడ్డుకట్ట వేసింది. చెన్నైలో జరుగుతున్న ప్రోకబడ్డీ లీగ్ లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో యూపీ జట్టు జైపూర్ జట్టుపై 31-24 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా 9 పాయింట్లు సాధించాడు. అతనికి తోడుగా డిఫెండర్ విశాల్ 4 పాయింట్లతో రాణించడంతో జైపూర్ విజయం సాధించేలా కనిపించింది. అయితే, ఆట ఆఖర్లో జైపూర్ తడబడడంతో యూపీ జట్టు విజయం సాధించింది. యూపీ జట్టులో రైదర్ సురీందర్ గిల్ 7 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ సీజన్ లో జైపూర్ 8 మ్యాచ్ లు ఆడగా ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక యూపీ యోధా ఇప్పటివరకూ 9 మ్యాచ్ లు ఆడింది. మూడు మ్యాచుల్లో గెలిచింది.

ఇక ఇక్కడే జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబాపై 30-27 తేడాతో హర్యానా స్టీలర్స్ గెలుపొందింది. ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన యు ముంబా చివర్లో అనూహ్యంగా తడబడి మూల్యం చెల్లించుకుంది. హర్యానా రైడర్ వికాస్ ఖండోలా 21 సార్లు రైడ్‌కి వెళ్లి 9 పాయింట్లతో సత్తాచాటాడు. సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన హర్యానాకి ఇది ఐదో గెలుపుకాగా.. యూ ముంబాకి ఐదో ఓటమి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories