తెలుగు టైటాన్స్ గెలుపు బాట పట్టింది..

తెలుగు టైటాన్స్ గెలుపు బాట పట్టింది..
x
Highlights

వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు జారిపోయిన తెలుగు టైటాన్స్ జట్టు పుంజుకుంటోంది. హర్యానా జట్టుపై ఆదివారం విజయం సాధించి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలోకి వెళ్ళింది.

ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 7లో ఇప్పటివరకూ ఓటములతో వెనుకంజలో ఉన్న తెలుగు టైటాన్స్ గెలుపు బాటలోకి వస్తోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న టైటాన్స్ మెల్లగా పుంజుకుంటోంది. ఆదివారం చెన్నై లో హర్యానా స్టీలర్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ 9వ స్థానాన్ని చేరుకుంది. టైటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ 18 పాయింట్లతో చెలరేగిపోయాడు. దీంతో హర్యానా స్టీలర్స్ కి జవాబు లేకుండా పోయింది. 40 - 29 తేడాతో టైటాన్స్ విజయకేతనం ఎగురవేసింది.

సిద్దార్థ రైడ్ కి వెళ్లిన ప్రతిసారి పాయింట్లు సాధించాడు. 18 సార్లు రైడ్ చేసి 18 పాయింట్లు కొల్లగొట్టాడు. ఇక హర్యానా జట్టులో వికాస్ కందోలా 9 పాయింట్లు సాధించినా..అతనికి డిఫెండర్ల నుంచి సహకారం లభించకపోవడంతో విజయానికి ఆమదదూరంలోనే హర్యానా నిలిచిపోక తప్పలేదు.

ఇక ఆదివారం ఇక్కడే జరిగిన రెండో మ్యాచ్ తమిళ్ తలైవాస్, పుణెరి పల్టాన్ మధ్య హోరాహోరీ గా సాగింది. రెండు జట్లు నువ్వా నేనా అని తలపడ్డాయి. తమిళ రైడర్లు చివర్లో చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇరుజట్లు చెరో 31 పాయింట్లు సాధించాయి. శనివారం జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైన తమిఅల్ తలైవాస్ ఈ మ్యాచ్ లో త్రుటిలో ఓటమి తప్పించుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories