ప్రో కబడ్డీ: జైపూర్ జోరు

ప్రో కబడ్డీ: జైపూర్ జోరు
x
Highlights

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింగ్ పాంథర్స్ అదరగొడుతోంది. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింగ్ పాంథర్స్ అదరగొడుతోంది. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెడుతోంది. అహ్మదాబాద్ లో గురువారం పుణెరి పల్టాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో జైపూర్ చెలరేగిపోయింది. 32-25 తేడాతో జైపూర్ ఘన విజయం సాధించింది. దీంతో జైపూర్ ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలుచుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక పుణెరి జట్టుకి ఇది ఏడో మ్యాచ్. ఈ ఓటమితో ఆ జట్టుకు ఇది ఐదో ఓటమిగా మిగిలింది.

మ్యాచ్‌లో జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా.. 16సార్లు రైడ్‌కి వెళ్లి 9 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ విశాల్ (4 పాయింట్లు) అతనికి చక్కటి సహకారం అందించాడు. దీంతో.. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి 17-11తో ఆధిక్యంలో జైపూర్ నిలిచింది. తర్వాత పుణెరి పల్టాన్ రైడర్ పంకజ్ మోహితే 8 పాయింట్లతో జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. డిఫెండర్ల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవడంతో ఆఖర్లో మరింత తడబడిన ఆ జట్టు వరుసగా పాయింట్లు ప్రత్యర్థికి ఇచ్చేసి ఓటమి పాలైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories