ప్రో కబడ్డీ లీగ్ లో అలవోకగా గెలిచిన తమిళ్ తలైవాస్!

ప్రో కబడ్డీ లీగ్ లో అలవోకగా గెలిచిన తమిళ్ తలైవాస్!
x
Highlights

స్టార్ రైడర్ రాహుల్ చౌదరి అద్భుత ప్రదర్శనతో 14 పాయింట్లు రాబట్టడంతో తమిళ్ తలైవాస్ జట్టు హరియాణా స్టీలర్స్ పై అలవోకగా విజయం సాధించింది. ప్రో కబడ్డీ...

స్టార్ రైడర్ రాహుల్ చౌదరి అద్భుత ప్రదర్శనతో 14 పాయింట్లు రాబట్టడంతో తమిళ్ తలైవాస్ జట్టు హరియాణా స్టీలర్స్ పై అలవోకగా విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో తమిళనాడు జట్టు 35-28 స్కోరుతో హరియాణ జట్టుకు చుక్కలు చూపించింది. అయితే, తొలి అర్థ భాగంలో హరియాణా బాగానే ఆడింది. 19 పాయింట్లు సాధించింది. ఇదే సమయంలో తమిళ జట్టు 10 పాయింట్లతో వెనుకబడింది. కానీ, రెండో అర్థ భాగంలో తమిళ తలైవాస్ బాగా పుంజుకున్నారు. దాంతో విజయకేతనం ఎగురవేశారు.

ఇక రెండో మ్యాచ్ లో పుణేరి పల్టన్‌ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి పట్నా పైరేట్స్‌ ఏదశలోనూ పోటీ ఇవ్వకపోవడంతో.. 20-41స్కోరుతో ఘన విజయం సాధించింది.Show Full Article
Print Article
More On
Next Story
More Stories