ప్రో కబడ్డీ లీగ్ లో మరో ఆసక్తికర పోరు

ప్రో కబడ్డీ లీగ్ లో మరో ఆసక్తికర పోరు
x
Highlights

మరో ఆసక్తికర పోరు ప్రోకబడ్డీ లో శనివారం జరిగింది. చివరి క్షణాల వరకూ విజయం ఎవరిదో తేలనంత పట్టుగా మ్యాచ్ సాగింది. ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా బెంగాల్...

మరో ఆసక్తికర పోరు ప్రోకబడ్డీ లో శనివారం జరిగింది. చివరి క్షణాల వరకూ విజయం ఎవరిదో తేలనంత పట్టుగా మ్యాచ్ సాగింది. ప్రో కబడ్డీ సీజన్ 7 లో భాగంగా బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ హోరా హోరీగా ఆడాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు బెంగాల్ పై 43-42 తేడాతో గెలుపొందింది. బెంగళూరు ఆటగాడు పవన్ కుమార్ ఒక్కడే 29 పాయింట్లు సాధించడం విశేషం.

ఇక శనివారమే జరిగిన మరో మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ పాట్నా పైరేట్స్ పై విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. పాంథర్స్ రైడర్ 9 పాయింట్లతో మెరవడంతో 21-34 పాయింట్ల తేడాతో విజయాన్ని సాధించింది పాంథర్స్ జట్టు.



Show Full Article
Print Article
Next Story
More Stories