Pro Kabaddi league: గుజరాత్ కి యూపీ షాక్!

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో యూపీ యోధ జట్టు గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్ జట్టుని చిత్తుచేసింది. దీంతో యూపీ...
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో యూపీ యోధ జట్టు గుజరాత్ ఫార్ట్యూన్ జెయింట్స్ జట్టుని చిత్తుచేసింది. దీంతో యూపీ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. కోల్‌కతాలో సోమవారం జరిగిన పోటీలో యూపీ గుజరాత్ ని 26-33 తేడాతో ఓడించింది. ఈ ఓటమితో గుజరాత్ జట్టు 8 వ స్థానానికి పడిపోయింది.
గుజరాత్ జట్టులో స్టార్ రైడర్ సచిన్ సూపర్-10తో మెరిసినా టీమ్‌ని మాత్రం గెలిపించలేకపోయాడు. మ్యాచ్‌లో 11 సార్లు రైడ్‌కి వెళ్లిన సచిన్.. 10 పాయింట్లను జట్టుకి అందించగా.. డిఫెండర్ సునీల్ 8సార్లు ట్యాకిల్స్‌కి ప్రయత్నించి.. 6 పాయింట్లు సాధించాడు. మరోవైపు యూపీ యోధా జట్టులో శ్రీకాంత్ 6 పాయింట్లతో సరిపెట్టగా.. డిఫెన్స్‌లో సుమిత్ ఐదు పాయింట్లే తెచ్చాడు. అయితే, ఆఖర్లో తప్పిదాలు దిద్దుకున్న యూపీ యోధా.. సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది.
ఇక సోమవారమే కోల్‌కతా వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై 25-51 తేడాతో పుణెరి పల్టాన్ ఘన విజయాన్ని అందుకుంది. పుణెరి స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ ఏకంగా 26 పాయింట్లతో సత్తాచాటగా.. డిఫెండర్ జైదీప్ ఏడు పాయింట్లు సాధించాడు. తమిళ్ జట్టులో అజిత్ కుమార్ 10 పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMTసమీపిస్తున్న వినాయ చవితి వేడుకలు.. నిమజ్జనం ఎక్కడ..?
21 May 2022 6:26 AM GMT