Pro Kabaddi league: పుణేరీ పల్టన్స్ పై పట్నా పైరేట్స్ ఘనవిజయం

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్ చక్కని ప్రదర్శనతో ఘనవిజయం నమోదు చేసింది.
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్ చక్కని ప్రదర్శనతో ఘనవిజయం నమోదు చేసింది. పుణెలో ఆదివారం రాత్రి పుణెరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 55-33 తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ జట్టులో స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 18 పాయింట్లుసాధించి పట్నా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో పాట్నా పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరినిది. పూణే జట్టు పదో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో పర్దీప్ నర్వాల్ 24 సార్లు రైడ్‌కి వెళ్లి 18 పాయింట్లని టీమ్‌కి అందించాడు. అతనికి డిఫెండర్ నీరజ్ కుమార్ 11 పాయింట్లతో సహకారం అందించడంతో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌కి ఎదురులేకుండా పోయింది.
ప్లేఆఫ్ ఆశలు ఇప్పటికే వదిలేసిన పుణెరి జట్టు.. ఈరోజు మ్యాచ్‌లోనూ తేలిపోయింది. రైడర్ మంజీత్ 12 సార్లు రైడ్‌కి వెళ్లి ఏడు పాయింట్లు సాధించగా.. డిఫెండర్ సుర్జీత్ మూడు పాయింట్లతో నిరాశపరిచాడు.
ఆదివారం రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ పార్చూన్ జెయింట్స్‌పై 34-30 తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయాన్ని అందుకుంది.
లైవ్ టీవి
Ind Vs WI 3rd T20 : భారీ స్కోరు దిశగా భారత్ .. రోహిత్ ఔట్
11 Dec 2019 2:31 PM GMTబ్యాడ్ న్యూస్ .. చిత్రం విడుదలపై రాంగోపాల్ వర్మ ట్వీట్
11 Dec 2019 2:19 PM GMTInd Vs WI 3rd T20 : సొంత గడ్డపై చెలరేగిపోతున్న రోహిత్
11 Dec 2019 1:56 PM GMTInd Vs WI 3rd T20 : టాస్ గెలిచిన వెస్టిండీస్
11 Dec 2019 1:03 PM GMTవైరల్ : కమల్ హాసన్‌తో బ్రావో భేటీ
11 Dec 2019 12:26 PM GMT