Pro Kabaddi league: పుణేరీ తో మ్యాచ్ టై చేసిన తలైవాస్

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన.. తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది.

K V D Varma
Updated on: 19 Sept 2019 11:04 AM IST
Pro Kabaddi league: పుణేరీ తో మ్యాచ్ టై చేసిన తలైవాస్
X

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన.. తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న తమిళ్ తలైవాస్, బుధవారం రాత్రి పుణె లో పుణెరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌ని అతికష్టం మీద 36-36తో టైగా ముగించింది. దీంతో.. రెండు జట్లు మూడేసి పాయింట్లు పంచుకోగా.. పుణెరి 37 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. కానీ.. తమిళ్ తలైవాస్ మాత్రం 30 పాయింట్లతో ఆఖరి (12వ) స్థానంతోనే మరోసారి సరిపెట్టింది. బుధవారం రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధాపై 36-39 తేడాతో యు ముంబా విజయాన్ని అందుకుంది.



K V D Varma

K V D Varma

Next Story