ఉత్కంఠ పోరులో పట్నా విజయం.. మరోపోరులో పూణేరి హ్యాట్రిక్ ఓటమి!

ఉత్కంఠ పోరులో పట్నా విజయం.. మరోపోరులో పూణేరి హ్యాట్రిక్ ఓటమి!
x
Highlights

ప్రో కబడ్డీ లీగ్ మ్యాచుల్లో భాగంగా ముంబాయిలో సోమవారం జరిగిన తమిళ్‌ తలైవాస్‌, పట్నా పైరేట్స్ మ్యాచ్ లో తలివాస్ ఓటమి పాలయ్యారు. మరో మ్యాచ్ లో పుణెరి...

ప్రో కబడ్డీ లీగ్ మ్యాచుల్లో భాగంగా ముంబాయిలో సోమవారం జరిగిన తమిళ్‌ తలైవాస్‌, పట్నా పైరేట్స్ మ్యాచ్ లో తలివాస్ ఓటమి పాలయ్యారు. మరో మ్యాచ్ లో పుణెరి పల్టన్‌ బెంగాల్ వారియర్స్ పై ఓటమి చవిచూసి.. హ్యాట్రిక్ ఓటమి నమోదు చేసుకుంది.

ఉత్కంఠ భరితంగా సాగిన తమిళ్‌ తలైవాస్‌, పట్నా పైరేట్స్ మ్యాచ్ లో ఒక్క పాయింట్‌ తేడాతో తమిళ్‌ తలైవాస్‌ జట్టు ఓటమి చవిచూసింది. ఆ జట్టు స్టార్‌ రైడర్లు రాహుల్‌ చౌదరి(5) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ.. సారథి అజయ్‌ ఠాకూర్‌(1)లు పూర్తిగా నిరాశపరిచాడు. సోమవారం ముంబై ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళ్‌ జట్టు 23-24 తేడాతో పట్నాపై పోరాడి ఓడిపోయింది.

ఇక రెండో మ్యాచ్ లో బెంగాల్‌ వారియర్స్‌ దూకుడుకు పుణెరి పల్టన్‌ సమాధానం ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే బెంగాల్ ఆటగాళ్ళు విరుచుకుపడ్డారు. దీంతో పుణేరీ ఆటగాళ్ళు తేరుకునే అవకాశమే లభించలేదు. ఈ మ్యాచ్ లో బెంగాల్‌ వారియర్స్‌ 43-23 తేడాతో పుణెరి పల్టాన్‌పై ఘన విజయం సాధించింది. బెంగాల్‌ వారియర్స్‌ రైడర్‌ మణిందర్‌ సింగ్‌(14) హోరెత్తించగా.. మహ్మద్‌ నబిబక్ష్‌(8), రింకూ నర్వాల్‌(5) రాణించారు. ఆ జట్టు స్టార్‌ రైడర్‌ ప్రపంజన్‌ పూర్తిగా విఫలమయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories