ప్రో కబడ్డీలో జైపూర్, హరియాణా బోణీ!

ప్రో కబడ్డీలో జైపూర్, హరియాణా బోణీ!
x
Highlights

తెలుగు టైటాన్స్‌పై విజయంతో ఊపుమీదున్న యూ ముంబా జట్టుకు జైపూర్‌ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రో కబడ్డీ సీజన్-7 లో భాగంగా మూడోరోజు సోమవారం జైపూర్...

తెలుగు టైటాన్స్‌పై విజయంతో ఊపుమీదున్న యూ ముంబా జట్టుకు జైపూర్‌ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రో కబడ్డీ సీజన్-7 లో భాగంగా మూడోరోజు సోమవారం జైపూర్ పింక్ పాంథర్స్ తో యు ముంబా తలపడింది. ఈ మ్యాచ్ లో యు ముంబా 23-42 తేడాతో జైపూర్‌ చేతిలో చిత్తైంది. తొలి రైడ్‌లోనే దీపక్‌ హుడా రెండు పాయింట్లతో జైపూర్‌కు ఇచ్చిన శుభారంభం తో జైపూర్ రెచ్చిపోయింది. పూర్తి అటాకింగ్ తో యు ముంబా ను కోలుకోనివ్వలేదు. దీంతో ఫస్ట్‌ హాఫ్‌ ముగిసే సరికి 22-9తో జైపూర్‌ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, రెండో అర్థ భాగంలో యు ముంబా కొద్దిగా పుంజుకుంది. దీంతో తేడాను తగ్గించగలిగింది కానీ, భారీ ఓటమిని మాత్రం తప్పించుకోలేకపోయింది. ఆ జట్టులో అందరూ విఫలం అయ్యారు.

ఇక సోమవారం జరిగిన రెండో మ్యాచ్ లో హరియాణా స్టీలర్స్‌ జట్టు పుణెరి పల్టాన్‌ను చిత్తు చేసింది. ఆరంభంలో హోరా హోరీగా మ్యాచ్ ప్రారంభం అయినా, క్రమేపీ హరియాణా.. పుణెరిని పూర్తిగా కట్టడి చేసింది. తొలి అర్ధభాగాన్ని 22-10తో ముగించిన హరియాణా, రెండో అర్థ భాగంలోనూ ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో 34-24తో హరియాణా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories