Top
logo

యుముంబా కెప్టెన్ గా మరోసారి ఫజల్‌ అట్రాచలీ

యుముంబా కెప్టెన్ గా మరోసారి ఫజల్‌ అట్రాచలీ
X
Highlights

ప్రో కబడ్డీ హడావుడి మొదలవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్...

ప్రో కబడ్డీ హడావుడి మొదలవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఫ్రాంచైజీలు తమ జట్లను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో యుముంబా కెప్టెన్ గా మరోసారి ఫజల్‌ అట్రాచలీ(ఇరాన్‌)ను కొనసాగించనున్నట్టు ప్రకటించారు. వైస్‌ కెప్టెన్‌గా సందీప్‌ నర్వాల్‌ వ్యవహరిస్తారని జట్టు మేనేజిమెంట్ మీడియా సమావేశంలో వెల్లడించింది.

ఈ సందర్భంగా ఫజల్ మాట్లాడుతూ తనకు కెప్టెన్సీ బాధ్యతలు మరోసారి అప్పగించడం సంతోషంగా ఉందన్నాడు. తనమీద ఉంచిన నమ్మకానికి న్యాయం చేస్తానని చెప్పాడు. ఇక వైస్ కెప్టెన్ సందీప్ నర్వాల్ మాట్లాడుతూ వ్యూహాలు రచించడం ఆటలో కీలకమని అభిప్రాయపడ్డాడు. వైస్‌ కెప్టెన్‌గా వ్యూహాలు రచించడంలో ముందుంటానని, ఆదిశగా సాధన చేస్తానని తెలిపాడు. యుముంబా జట్టు ఈనెల 20న జరిగే మొదటి మ్యాచ్ తో ప్రారంభించనుంది. తెలుగు టైటాన్స్ జట్టుతో యుముంబా జట్టు తలపడనుంది.

Next Story