Pro Kabaddi : పవన్ పోరాటంతో సెమీస్ చేరిన బెంగళూరు బుల్స్

X
Highlights
అహ్మదాబాద్ వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ప్రారంభమైయ్యాయి. యూపీ యోధా బెంగుళూరు బుల్స్ మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించారు.
Samba Siva Rao15 Oct 2019 1:14 AM GMT
అహ్మదాబాద్ వేదికగా ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ప్రారంభమైయ్యాయి. యూపీ యోధా బెంగుళూరు బుల్స్ మధ్య తొలి ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యచ్‌లో బెంగళూరు బుల్స్ 48-45 తేడాతో యూపీ యోధాపై విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో మ్యాచ్ ముగిసేసరికి రెండు జట్లు 36-36తో సమానంగా నిలిచాయి. ఆరు నిమిషాల అదనపు సమయంలో బెంగళూరు విజయాన్ని అందుకుంది.
ఈ మ్యచ్‌లో బెంగళూరు బుల్స్ రైడర్ పవన్ షెరావత్ 20 పాయింట్లు సాధించాడు. అదనపు సమయంలోను వరుస పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్ లో బెంగళూరు బుల్స్ దబాంగ్ ఢిల్లీతో తలపడనుంది.
Next Story