బెంగాల్‌ వారియర్స్‌తో టైటాన్స్‌ 'టై'

బెంగాల్‌ వారియర్స్‌తో టైటాన్స్‌  టై
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 30-24తో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌పై గెలిచి విజయ భేరి మోగించిదని తెగ సంబురపడ్డారు అభిమానులు. ఇక ఇప్పటి నుండి టైటాన్స్ పూంజుకుంటుంది అనుకున్న టైటాన్స్.. ఆ దూకుడు కేవలం ఒక మ్యాచేతోనే సరిపెట్టుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 30-24తో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌పై గెలిచి విజయ భేరి మోగించిదని తెగ సంబురపడ్డారు అభిమానులు. ఇక ఇప్పటి నుండి టైటాన్స్ పూంజుకుంటుంది అనుకున్న టైటాన్స్.. ఆ దూకుడు కేవలం ఒక మ్యాచేతోనే సరిపెట్టుకుంది. నిన్న(సోమవారం) బెంగాల్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29-29తో టై చేసుకుంది. అయితే ప్రొ కబడ్డి లీగ్ ఏడో సిజన్‌లో టైటాన్స్‌కి ఇది రెండో టై కావడం విశేషం. అయితే మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురవడంతో టైటాన్స్‌ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. కాగా చివరకు మొళ్లీగా ఒక్కోఒక్కో పాయింట్ తో దూకుడు మీదున్న బెంగాల్ వారియర్స్ రెండో భాగంలో తెలుగుటైటాన్స్‌ని ఆలౌట్‌ చేసి 23–21తో ముందువరుసలోకి వెళ్లగా.. చిట్టచివర్లో మాత్రం టైటాన్స్‌ పూంజుకొని స్కోర్‌ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. ఇకపోతే రెండో మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. ఇకపోతే రేపు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్‌; గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో బెంగాల్‌ వారియర్స్‌ ఢీకొనబోతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories