తెలుగు టైటాన్స్‎ను గెలిపించిన సిద్ధార్థ్ దేశాయ్

తెలుగు టైటాన్స్‎ను గెలిపించిన సిద్ధార్థ్ దేశాయ్
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌ లో తెలుగు టైటాన్స్‎కు సిద్థార్ధ్ దేశాయ్ విజయాన్ని అందించాడు. ఏకంగా 22 పాయింట్లతో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని చేకుర్చాడు. జైపూర్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్‎లో జరిగిన మ్యాచ్‎లో 53-31 పాయింట్ల తేడాతో అలవోకగా గెలుపొందారు.

జైపూర్ గడ్డపై ఇదే చివరి మ్యాచ్‌. సిద్ధార్ధ్‎కు తోడు రజ్‌నీశ్‌ దలాల్‌ కూడా పదకొండు పాయింట్లతో ట్యాక్లింగ్‌లో ఫర్హాద్‌ మిలాఘర్దాన్‌ కూడా నాలుగు పాయింట్లుతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో సమిష్టిగా తెలుగు టైటాన్స్ రాణించింది.

జైపూర్ పింక్ పాంథర్స్ జట్టులో దీపక్ 12 పాయింట్లు సాధించాడు. కానీ డిఫెన్స్‌లోనూ ఎవరూ రానించకపోవడంతో ఆ జట్టుకు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‎లో పరాభవం ఎదురైంది. 20వ మ్యాచ్ ఆడిన జైపూర్ పది ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో మొత్తం 18వ మ్యాచ్‌ ఆడిన తెలుగు టైటాన్స్ ఐదో విజయాలు అందుకుంది. ఇక మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌, యు మంబాకు జరిగింది. బెంగళూరు బుల్స్ 35–33తో యు ముంబాపై విజయం సాధించింది. పవన్‌ షెరావత్‌ 11 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories