బెంగాల్ వారియర్స్ మళ్లీ గెలుపు బాట

బెంగాల్ వారియర్స్ మళ్లీ గెలుపు బాట
x
Highlights

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ సిజన్ లో అగ్రశ్రేణి జట్టుగా నిలిచిన, బెంగాల్ వారియర్స్ కొన్ని మ్యాచ్లో తడబడింది. తాజాగా ప్లే‌ఆఫ్ రేసు ఉత్కంఠ భరితంగా మారడంతో హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48-36 తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలోనూ రెండో స్థానానికి ఎగబాకింది.

ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ సిజన్ లో అగ్రశ్రేణి జట్టుగా నిలిచిన బెంగాల్ వారియర్స్ కొన్ని మ్యాచ్లో తడబడింది. తాజాగా ప్లే‌ఆఫ్ రేసు ఉత్కంఠ భరితంగా మారడంతో, హర్యానా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48-36 తేడాతో గెలుపొందిన బెంగాల్ వారియర్స్ పాయింట్ల పట్టికలోనూ రెండో స్థానానికి ఎగబాకింది.

బెంగాల్ వారియర్స్ జట్టులో మణీందర్ 18 పాయింట్లతో ఒంటిచేత్తో టీమ్‌ని విజయతీరాలకి చేర్చాడు. అతనికి డిఫెండర్ బలదేవ్ నుంచి మంచి సహకారం లభించింది. 10 ట్యాకిల్స్‌కి ప్రయత్నించిన బలదేవ్ ఆరు పాయింట్లని టీమ్‌కి అందించాడు.

హర్యానా జట్టులో స్టార్ రైడ్‌‌గా ఎదుగుతున్న వినయ్ జట్టుని గెలిపించేందుకు ప్రయత్నించాడు. మ్యాచ్‌లో 16 సార్లు రైడ్‌‌కి వెళ్లిన వినయ్ 14 పాయింట్లు సాధించాడు. ఇక డిఫెన్స్ వికాస్ కాలే తేలిపోయాడు. 9 సార్లు ట్యాకిల్‌కి ప్రయత్నించిన వికాస్ మూడు పాయింట్లు మాత్రమే సాధించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories