Rana Daggubati - Miheeka Wedding Pics : రానా- మిహీకా పెళ్లి ఫోటోలు!
Rana Daggubati - Miheeka Wedding Pics : టాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి.. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి పుల్ స్టాప్
Rana Daggubati - Miheeka Wedding
Rana Daggubati - Miheeka Wedding Pics : టాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి.. తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి పుల్ స్టాప్ పెట్టి, వివాహ బంధంతో నూతన జీవితంలోకి అడుగులేశారు. తన ప్రియురాలు మిహీకా బజాజ్ మెడలో నిన్న (శనివారం) రాత్రి 8.30 నిమిషాలకు వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి రామానాయుడు స్టూడియో వేదికైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. వీరి వివాహం జరగ్గా.. ఇరుకుటుంబాల నుంచి కేవలం 30 మంది మాత్రమే బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి సమంతతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సమంత, నాగచైతన్యలు వీరి వివాహవేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story












