మీ స్ట్రెస్కి, బ్రేకప్ చెప్పండి ఇలా

మీ స్ట్రెస్కి, బ్రేకప్ చెప్పండి ఇలా
x
Highlights

హాయ్ ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే విషయం "మీ స్ట్రెస్ కి బ్రేకప్ చెప్పండి ఇలా" అడవిలో మీరు ఒక్కరే నడచుకుంటూ వెళుతున్నారు అనుకుంటే....ఎదురుగా...

హాయ్ ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే విషయం "మీ స్ట్రెస్ కి బ్రేకప్ చెప్పండి ఇలా"

అడవిలో మీరు ఒక్కరే నడచుకుంటూ వెళుతున్నారు అనుకుంటే....ఎదురుగా ఒక పులి వచ్చింది అనుకుందాము...ప్రాణ భయంతో మీరు తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు కదా, అప్పడు మీ వద్ద రెండు ఆప్షన్స్ మాత్రమే వుంటాయి, ఒకటి ఆ పులిని చూడగానే అక్కడి నుండి పారిపోవడం, లేదా ఆ పులితో పోట్లాడటం, ఈ రెండిటినె....పోరాటమైతే "ఫైట్ మోడ్" అని పారిపోవడం అయితే "ఫ్లైట్ మోడ్" అని అంటాము. అడవిలో పులి ముందు మనకి ఈ రెండు అవకాశాలు వుంటాయి. కాని ఆఫీసులో పులి లాంటి బాస్ మన మీద అరుస్తూ వుంటే, లేదా ఇంట్లో పెద్ద వారు మనని తప్పు పడుతూ మాట్లాడుతుంటే, చాల సందర్బాలలో అక్కడినుండి పారిపోలేము, లేదా వారితో శారిరకంగా పోరాడలేము కదా. అప్పుడు ఒక్క ఫ్రీజ్ మాత్రమే అయిపోతాము. ఇలా ఎక్కువ సార్లు, ఎక్కువ సందర్బాలలో ఫ్రీజ్ అయిపోతు వుంటే మాత్రం...ఈ ఒత్తిడి వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎన్నో మానసిక సమస్యలు, ఎన్నో కుటుంభ పరమైన సమస్యలు వస్తాయట. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అనవసర ఒత్తడిని ఒదిలించుకోవాలి. దానికి ముఖ్యంగా మన ఆలోచన విదానంలో మార్పురావాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాము.

ఫ్రండ్స్ ! మీ సమస్య కి ఏదైనా ఒక పరిష్కారం ఉండే అవకాశం వుంటే మీరు ఒత్తిడి పడటం వలన లాభం ఏంటో ఆలోచించండి? అలా కాకుండా...మీ సమస్యకి ఎలాంటి పరిష్కారం ఈ ప్రపంచంలో లేకుంటే ఎంత ఒత్తిడి తీసుకున్నా మీకు ఏమి లాభం ఆలోచించండి? కాబట్టి సమస్య గురించి ఎక్కువగా ఆలోచించకుండా పరిష్కారం ఏమిటో ఆలోచించండి.ఇలా ఆలోచించడం వలన కొంత ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మనం అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే....మన బాధ్యతల యొక్క బరువు, మనని ఒత్తిడిలోకి నెట్టదట.కాని ఆ బరువుని మనం ఎలా మోస్తున్నాము అనేది ఒత్తిడిలోకి నెడుతుందట. అదెలా అంటే.... ఒక భరువు వున్నా సూట్కేసును మనం నెత్తి మీద మోస్తున్నమా లేదా చేతిలో పట్టుకొని వెలుతున్నమా లేదా దానికు వున్నా చక్రాల సహాయంతో నెట్టుకుంటూ వెళ్తున్నమా అనేది మన ముందు ఉండే ఛాయస్, అయితే ఈ మూడు విధానాల్లో ఎలాగైనా ఆ సూట్కేసును తీసుకు పోవచ్చు. ఈ అవకాశలు వున్నాయని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ సూట్కేసును మూడు విధానాలుగా తీసుకేల్లినట్టే మన వత్తిడిని కూడా రకరకాలుగా మేనేజ్ చెయ్యవచ్చు.

కొన్ని సందర్భాల్లో మోతాదులో వున్నా ఒత్తిడి మన విజయానికి ఉపయోగపడుతుంది అని ఎక్స్పర్ట్స్ చెపుతున్నారు. అదెలా అంటే మీ ఒత్తిడి అనే బరువుకి, మీ లక్ష్యం అనే రెక్కలు తొడిగి చూడండి, అంతే మీ ఒత్తిడి మీ ముందే అలా ఎగిరిపోతుంధట. ఇలా మీరు ఒత్తిడిని చిత్తు చేయాలి అంటే, ఒక సమయంలో ఒక ఆలోచన మీద మాత్రమే మీ పూర్తి దృష్టి పెట్టండి. అలా ఎప్పుడైతే మీ మనసుని ఒక్క ఆలోచన మీద కేంద్రీకరిస్తారో, అప్పడు ఒత్తిడి సహజంగానే తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆ ఒక్క ఆలోచన మీ లక్ష్యసాధనకి సంభందించిన ఆలోచన అయివుండాలి. ఇంకా మరి కొన్ని విధానాల్లో కూడా మీ స్ట్రెస్ కి మీరు బ్రేక్ అప్ చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్ధము.

ఈ రోజుల్లో పెరుగుతున్న ఒత్తిడి ఎలాంటిదంటే... మన ఇంట్లో రోజూ చేరే చెత్త లాంటిది. ఎ రోజు చెత్త ఆరోజు బయట వేయాల్సి ఉంటుంది లేకుంటే మన ఇల్లంతా చెత్త తో నిండి, చెత్తకుండీలా అవుతుంది. అలా కాకుండా ఒత్తిడిని చిత్తడి చేసి వదిలించుకోవటం ఎలాగో చూద్దాము. ఒత్తిడిని తగ్గించడానికి ముందుగా మీ వర్క్ క్ అండ్ హోం బ్యాలెన్స్ చెయ్యడం నేర్చుకోవాలి. ఎందుకంటే మీ పని ఒత్తిడి మీ ఆరోగ్యానికి హాని చెయ్యవచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్ ఫిజికల్ ఎక్ససైజ్ కూడా చేయాలి. అలాగే మెడిటేషన్ మరియు yoga నేర్చుకుంటే కూడా ఎంతో ఒత్తిడి తగ్గుతుంది అని ఎన్నో పరిశోధనలు చెపుతున్నాయి. ముఖ్యంగా సరైన ఆహారం, సరైన సమయానికి తీసుకొని, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడైనా తట్టుకోలేనంత ఒత్తిడి మీకు అనిపించినప్పుడు, మీకు సపోర్ట్ గా నిలిచే దగ్గరి వ్యక్తులతో మాట్లాడాలి. అలాగే మీరు, మీకు నచ్చిన హాబి లు కొన్ని డెవలప్ చేసుకోవాలి, దీనివలన మీకు రొటీన్ నుంచి బ్రేక్ తీసుకున్నట్టు అవుతుంది, కొంత రిలాక్స్ అవుతారు. ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఎ పనైనా చెయ్యమని కోరితే, అది మీకు ఇబ్బంది కలిగిస్తే వారికీ నో అని చెప్పడం నేర్చుకోవాలి.

ముఖ్యంగా మీ యొక్క టైం ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలావరకు ఒత్తిడికి ముఖ్య కారణం టైం సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడమే. ఇంకా మీ ఒత్తిడి గురించి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఒక పేపర్ పై వ్రాయండి. అలా మీ ఆలోచనలని ఒక పేపర్ పై పెట్టడం వలన కూడా ఆశ్చర్యకరంగా కొంత ఒత్తిడి తగ్గుతుంది.

చివరిగా ఒత్తిడి మీద బ్రంహస్త్రం లా పనిచేసే టెక్నిక్ ..... దీర్గ శ్వాస. ఎప్పుడైతే మీరు ఒత్తిడిని మీలో గమనిస్తారో, వెంబడే..ఒక రెండు నిముషాలు ప్రశాంతంగా కూర్చొని 21 సార్లు దీర్గ శ్వాస తీసుకోండి. మన శ్వాస తీసుకునే విధానానికి, మన ఒత్తిడికి చాల దగ్గరి సంభందం వుంది అని ఎన్నో పరిశోదనలు ఋజువు చేసాయి. కాబట్టి ఎప్పుడు మీకు ఒత్తిడి అనిపించినా కూడా 21 సార్లు దీర్గ శ్వాస తీసుకోవడం వలన మీ ఒత్తిడికి మీరు బ్రేక్ అప్ వెంబడే చెప్పగలరు. ఫ్రండ్స్ ఇప్పటివరకు మనం చర్చించిన ఈ విషయాలను మీరు ఆచరణలో పెట్టడం ద్వార ఒత్తిడిని తగ్గించుకొని, విజయాన్ని సాదించగలరు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories