పోరాట పటిమ పెంచుకోవాలి.

మన వైఫల్యం మన జీవితంలో నేర్చుకోవడంలో ఒక భాగం అని నమ్మాలి....జీవితంలో పోరాటాన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు.
రాము: నీవు ఏనుగును ఒక రిఫ్రిజిరేటర్‌లో ఎలా పెడతావు?
శ్యాం: అదెలా సాద్యం... అసాద్యం...అన్నాడు.
రాము: ఓస్... ఇది తెలవదా...ఫ్రీజ్ తలుపు తెరిచి, ఏనుగును లోపలికి ఉంచి, తలుపు మూసివేయదామే.. అన్నాడు.
ఇలాంటి...సిల్లీ జోక్స్ మీరు వినే వుంటారు... అయితే మన నిజ జీవితంలో కూడా కొన్ని సార్లు...మనం కొన్ని ఫెయిల్యూర్స్ రాగానే, వింతగా ప్రవర్తిస్తాం. ఓటమి కొన్ని సార్లు మనని తిరిగి ప్రయత్నించకుండా ఆపుతుంది..అదెలా అంటే....
ఒక వ్యక్తి వారి ఊరి లో జరుగతున్న సర్కస్స్ దగ్గరలోని ఏనుగులను దాటుతుండగా, అతను అకస్మాత్తుగా ఆగిపోయాడు, ఆ భారీ ఏనుగుకు ముందు కాలుకు కట్టిన చిన్న తాడు మాత్రమే ఉండటాన్ని చూసి ఆందోళన చెందాడు. గొలుసులు లేవు, బోను లేదు. ఏనుగు ఎప్పుడైనా తన బంధాల నుండి విడిపోగలదని అనుకున్నాడు, కాని ఎ కారణాల వల్ల అది అలా చేయలేదో అతనికి అర్ధం కాలేదు. అతను సమీపంలో ఉన్న ఒక శిక్షకుడిని చూశాడు, అతని వద్దకు వెళ్లి ఎందుకు ఏనుగు...అక్కడ నిలబడి, తప్పించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు అని అడిగాడు.
అప్పుడా శిక్షకుడు..."ఆ ఏనుగు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేము వాటిని కట్టడానికి పెద్ద ఇనప గొలుసుల తాడును ఉపయోగిస్తాము, ఆ వయస్సులో అది తప్పిచ్చుకోవాలని చాల ట్రై చేస్తుంది... కాని తప్పిచుకోలేదు.....అలా పెరిగేకొద్దీ ఇక తన వలన కాదని నమ్ముతాది. ఆ చిన్న తాడు ఇప్పటికీ వాటిని బందిచే వుంటుంది అని నమ్మి అవి విడిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించదు. " అని చెప్పాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఈ ఏనుగు ఎప్పుడైనా దాని బంధాల నుండి విముక్తి పొందగలదు , కాని అది చేయలేవని నమ్ముతున్నందున, అది ఉన్న చోటనే ఇరుక్కుపోయింది.
ఆ ఏనుగుల మాదిరిగానే, మనలో ఎంతమంది, మనం ఏదో చేయలేము అనే నమ్మకంతో జీవిస్తున్నాం, అంతకుముందు ఏదో ఒక సందర్భంలో ఒక్కసారి విఫలమైనందున. కాబట్టి ఆ ఏనుగులా కాకుండా... మన వైఫల్యం మన జీవితంలో నేర్చుకోవడంలో ఒక భాగం అని నమ్మాలి....జీవితంలో పోరాటాన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు. అల్ ది బెస్ట్.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT