బద్ధకం బారి నుండి బయటపడాలి.

బద్ధకం బారి నుండి బయటపడాలి.
x
Highlights

ఫ్రెండ్స్! జీవితంలో విజయం సాధించాలి అంటే, ఒక లక్ష్యం వుండాలి, దాని సాధనలో వచ్చేఅడ్డంకులను, అవరోధాలను అధిగమించడమే అజేయుడి లక్షణం. ఆ సమయలో వారు కనపర్చే...

ఫ్రెండ్స్! జీవితంలో విజయం సాధించాలి అంటే, ఒక లక్ష్యం వుండాలి, దాని సాధనలో వచ్చేఅడ్డంకులను, అవరోధాలను అధిగమించడమే అజేయుడి లక్షణం. ఆ సమయలో వారు కనపర్చే లక్షణాలనే మనం పట్టుదల అని కూడా అంటాం. కానీ కొద్దిమంది మాత్రం ఎలాంటి పట్టుదల లేక, వారి బద్ధకం తో, వారు ఎ పనిని సాధించక, చివరికి ఒక సోమరిలా మిగిలిపోతారు. వారు ఎంత సేపటికి తమ ముందు వున్న పనిని ఎలా తప్పించుకోవాలి అని అలోచిస్తువుంటారు, లేదా ఆ పనిని ఎలా ఇతరుల మీదకు తోసేయ్యాలి అని అలోచిస్తువుంటారు.

అయితే మన లక్ష్యం వైపు మనం నిజాయితీ మరియు చిత్తశుద్ధితో పని చేయకుండా వుంటే, మన సోమరితనం, బద్ధకం తో వుంటే మాత్రం…ఆ బద్దకమే మనల్ని నాశనం చేస్తుంది. దీనిని అర్ధం చేసుకోడానికి ఇప్పుడు మనం ఒక కథ చూద్దాం. ఒక ఊర్లో సాంబయ్య అని వ్యక్తి వుండే వాడు. అతని దగ్గర సోము అనే గాడిద ఉంది. సాంబయ్య చాలా సహనం మరియు దయగల యజమాని. సోము గాడిద మాత్రం సోమరితనంలో తన పనిని ఎప్పుడు తప్పిచ్చుకొనే మార్గాలను కనుగొంటువుండేది.. ఒకసారి ఆ సోము గాడిద పైన సాంబయ్య పక్క పట్టణములో కొన్న ఉప్పు బస్తా వేసి తన ఊరికి బయలుదేరాడు. మద్యలో నది ఒకటి వుంది. అయితే తన వెనుక భాగంలో ఉప్పుతో తిరిగి వస్తున్నప్పుడు, సోము నదిలో కావాలని మునగసాగింది. తన వీపు పై వున్నా ఉప్పు నీటిలో కరిగిపోవడంతో బస్తాల బరువును తగ్గించిందని సోము గ్రహించింది.

తరువాతి కొద్ది రోజులు సోము ప్రతిరోజూ ఉప్పు బస్తా తెసున్నప్ప్డుడల్లా ఉద్దేశపూర్వకంగా నీటిలో మునగాసాగింది. ఈ ప్రక్రియలో డబ్బును కోల్పోతున్నందున సోము ప్రవర్తించే తీరుపై సాంబయ్య అసంతృప్తితో ఉన్నాడు. అతను సోముకు కు ఒక పాఠం నేర్పించాలని నిర్ణయించుకున్నాడు.

మరుసటి రోజు ఉప్పు సంచులకు బదులుగా అతను సోము పై పత్తి సంచులతో లోడ్ చేసాడు. ఈ మార్పు గురించి సోముకి తెలియదు. సాంబయ్య అనుకున్నట్లుగా సోము నీటిలో పడి సంచులను తడిపివేసింది. ఆ తర్వాత భారాన్ని భరించలేక సోము ఆ భరువు విషయంలో ఆశ్చర్యపోయింది. ఇదంతా గమనించిన సాంబయ్య..దానిని రెండు దెబ్బలు కొట్టి, దానికి బుద్ధి వచ్చేలా చేసాడు. ఈ కథలో సోములా కొద్దిమంది బద్దకంతో పని తప్పించుకోవాలని చూస్తారు...కాని ఆ పని అంతా కలిసి, ఒకే సారి వారి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పడుతుంది. కాబట్టి బద్దకాన్ని వదిలి పనిని గౌరవించటం, అంకితభావం తో చెయ్యడం చాల ముఖ్యం. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories