చెప్పింది చెయ్యటం, చేసేది చెప్పటం వ్యక్తిత్వం

జర్నలిస్టు: మీరు రాసిన 'బార్యాభర్తలు అనుభంధం పెంచుకోవడం ఎలా అనే పుస్తకం చదివానండీ.. దానిపై మిమ్మల్ని ఇంటర్వ్యూ ...
జర్నలిస్టు: మీరు రాసిన "బార్యాభర్తలు అనుభంధం పెంచుకోవడం ఎలా అనే పుస్తకం చదివానండీ.. దానిపై మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను.
సుబ్బారావు : సరే కానీయండి.. నాకు కాలు బాగా లేదు, నేను లేవలేను.. కాస్తా ఆ కుర్చీ తీసుకుని కూర్చోండి.
జర్నలిస్టు: ఏమైందండీ..
సుబ్బారావు: రెండు రోజుల నుంచి లేవలేకపోతున్నాను..మొన్న నేను వంట బాగా చెయ్యలేదని మా ఆవిడ నా కాలుపై గిన్నతో కొట్టింది..... అంతే! అన్నాడు.
ఇలాంటి వ్యక్తులు మనకు మన సమాజంలో కనపడుతూనే వుంటారు. వారు మాట్లాడేదానికి, చెప్పే దానికి, వారు వాస్తవంలో చేసేదానికి అసలు పొంతనే ఉండదు. కాని వారి మాటలతో మాత్రం ఇతరులను చాల ప్రభావితం చెయ్యాలని చూస్తారు. కొంత వరకు ప్రభావితం చేస్తారు. కాని ఎక్కువ కాలము ఇలాంటి వారు, వారి వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేరు. కొద్ది రోజుల్లోనే వీరు చెప్పేదానికి, చేసేదానికి సంబంధం లేదని ఇతరులు గుర్తిస్తారు. మరి ఇలాంటి వ్యక్తులను మనం నమ్మి, వారి మాటలు ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనం మనకు కావాల్సిన విషయాలలో మాత్రం చాల స్పష్టత కలిగి వుండాలి. అయితే కొద్ది మంది మరి రూల్స్ అంటూ తమ కామన్ సెన్స్ ని కూడా పక్కన పెడతారు. మాములు సమయంలో ట్రాఫిక్ లైట్ ని దాటేయడం సరైనది కాదు, కాని అంబులన్స్ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్ రెడ్ వుందని వెళ్ళకపోవడం సరైనది కాదు కదా. అదెలా వుంటుంది అంటే.... ఒక సారి...
సుబ్బారావు తన మిత్రుడు అయిన రవి తో అన్నాడు.... అరె రవి... నాకు రైల్లో నిద్ర పట్టలేదురా...
రవి : ఎందుకురా ట్రైన్ సౌండ్ కా...
సుబ్బారావు: కాదురా.... నాకు అప్పర్ బర్త్ వచ్చింది..
రవి : మరి ఎవరితోనైనా ఎక్స్‌చేంజ్ చేసుకోలేకపోయావా...
సుబ్బారావు: ఆ.....చేసుకుందామంటే కింది బెర్త్‌లో ఎవరూ లేరు మరి.
మరి ఇలా బ్రతకాల్సిన అవసరం లేదు కదా... కాబట్టి ఎ పరిస్థితుల్లో, ఎలా ప్రవర్తించాలి అని మనం నిర్ణయించుకోవాలి. అల్ ది బెస్ట్.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT