ZyCoV-D: త్వరలో అందుబాటులోకి రానున్న నాలుగో వ్యాక్సిన్‌

ZyCoV-D: Fourth Vaccine could Soon join the Fight Against COVID-19 in India
x

ZyCoV-D: త్వరలో అందుబాటులోకి రానున్న నాలుగో వ్యాక్సిన్‌

Highlights

ZyCoV-D: దేశీయంగా అభివృద్ధి చేసిన మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోంది.

ZyCoV-D: దేశీయంగా అభివృద్ధి చేసిన మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోంది. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా జైకోవ్-డి పేరుతో వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీన్ని అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం త్వరలోనే దరఖాస్తు చేయబోతోందట. ఈ నెలలోనే టీకాకు అనుమతులు లభిస్తాయని సంస్థ నమ్మకంగా ఉంది. అనుమతులు లభించిన వెంటనే టీకా ఉత్పత్తి ప్రారంభిస్తామని, నెలకు కోటి డోసులు తయారు చేస్తామని కంపెనీ ఎండీ శార్విల్ పటేల్ వెల్లడించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి మాదిరిగా ఇది రెండు డోసుల టీకా కాదు మూడు డోసుల టీకా. మూడు డోసుల టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ ఎండీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories