Zomato: వివాదాస్పద ప్రకటనపై సారీ చెప్పిన జొమాటో

Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వివాదంలో చిక్కుకుంది.

Arun Chilukuri
Updated on: 21 Aug 2022 9:30 PM IST
Zomato Apologises After row Over Hrithik Roshan ad
X

Zomato: వివాదాస్పద ప్రకటనపై సారీ చెప్పిన జొమాటో

Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వివాదంలో చిక్కుకుంది. హిందువులను కించపరిచే విధంగా యాడ్ ఇచ్చి వివాదంలో ఇరక్కుంది. ఇందుకు ప్రస్తుతం ఆ సంస్థ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. తనకు ఆకలి అయితే మహాకాళి నుంచి ఆర్డర్ చేస్తానంటూ నటుడు హృతిక్ రోషన్ నటించిన వివాదాస్పద ప్రకటన విషయంలో జొమాటో తన తప్పును సరిదిద్దుకుని క్షమాపణలు చెప్పింది.

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ పూజారుల డిమాండ్ మేరకు ప్రకటనను సరిచేయడమే కాకుండా, జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా కోరింది. మహాకాళ్ అన్న చోట రెస్టారెంటును చేర్చి ప్రకటనలోని కంటెంట్‌ను సవరించింది. అంతేకానీ, మహాకాళేశ్వర్ ఆలయం నుంచి కాదని వివరణ ఇచ్చింది. అయితే ఎంతో పవిత్రమైన ఆలయ ప్రసాదాన్ని కించపరిచేలా ప్రకటనలు ఇవ్వడాన్నిఆలయ పూజారులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story