ముంబై ధారవిలో కరోనా కేసుల సంఖ్య జీరో

జూలైలో రెండు కేసులు నమోదు

admin
Published on: 26 Dec 2020 7:11 AM IST
ముంబై ధారవిలో కరోనా కేసుల సంఖ్య జీరో
X

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తు్నప్పటి నుంచి అత్యధిక జనాభా కలిగిన ధారవిలో ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది జూలై 26న ధారవిలో రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. అప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. కరోనాకు హాట్ స్పాట్‌గా నిలిచింది ధారవి ప్రాంతం. దాంతో ఈ ప్రాంతంపై అధికారులు దృష్టి సారించారు. భౌతిక దూరం వంటి కరోనా నియమాల అమలును పకడ్భందిగా అమలు చేశారు. దాంతో ఇప్పుడు అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు..

admin

admin

Next Story