YS Sharmila: నేడు ఢిల్లీలో వైఎస్‌ షర్మిల దీక్ష

YS Sharmila: ఉ.10 గంటలకు జంతర్‌మంతర్‌లో షర్మిల దీక్ష

Jyothi
Updated on: 2 Feb 2024 8:46 AM IST
YS Sharmila Diksha in Delhi today
X

YS Sharmila: నేడు ఢిల్లీలో వైఎస్‌ షర్మిల దీక్ష 

YS Sharmila: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వివిధ రాష్ట్రాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ బడ్జెట్ సమావేశాలలకు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై అనేక డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న వైయస్ షర్మిల వచ్చే ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రజా మద్దతును కూడగట్టడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రచారం చేస్తున్న షర్మిల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్‌తో పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే లేఖ రాసిన షర్మిల.. ఢిల్లీ వేదికగా దీక్ష చేపట్టనున్నారు.

Jyothi

Jyothi

Next Story