తిరగబడ్డ ఫీట్.. బొక్కబోర్లా పడిన యువకుడు..

Srinivasa Sagara Dam: కర్నాటకలో 20 ఏళ్ల యువకుడు భయంకరమైన స్టంట్‌ చేస్తూ బొక్కబోర్లా పడ్డాడు.

Arun Chilukuri
Published on: 23 May 2022 7:01 PM IST
Youth Falls Down the Wall of Srinivasa Sagara Dam in Chikkaballapur
X

తిరగబడ్డ ఫీట్.. బొక్కబోర్లా పడిన యువకుడు..

Srinivasa Sagara Dam: కర్నాటకలో 20 ఏళ్ల యువకుడు భయంకరమైన స్టంట్‌ చేస్తూ బొక్కబోర్లా పడ్డాడు. 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను ఎక్కబోయి ఒక్కసారిగా కిందకు జారిపడ్డాడు. దీంతో యువకునికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్నాటక చిక్కబళ్లపూర్ జిల్లాలోని శ్రీనివాస సాగర్ డ్యామ్ నుంచి మత్తడి దుంకుతోంది. అయితే అక్కడికి చేరుకున్న ఓ 20 ఏళ్ల యువకుడు 50 ఫీట్ల ఎత్తున్న డ్యామ్‌ను కింద నుంచి ఎక్కేందుకు సాహసం చేశాడు. 25 ఫీట్ల వరకు బాగానే ఎక్కినా ఆ తర్వాత పట్టు తప్పడంతో జారిపడ్డాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. అక్కడున్న వారు వెంటనే బాధితుడిని చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story