Viral: కారు నాదే అని రెచ్చిపోతే..ఇదిగో ఇలాగే జరుగుతుంది!

Social Media: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్న ఓ యువకుడికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఝలక్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 16 March 2021 5:39 PM IST
Viral: కారు నాదే అని రెచ్చిపోతే..ఇదిగో ఇలాగే జరుగుతుంది!
X

Viral: సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్న ఓ యువకుడికి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. అప్పటికప్పుడు హీరో అయిపోవాలనుకున్నాడో ఏమో.. యూపీకి చెందిన ఉజ్వల్ యాదవ్ రన్నింగ్ కార్ స్టీరింగ్ వదిలి పైకెక్కి మరీ పుషప్స్ కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో యూపీ పోలీసుల కంట పడింది.

దానికి వెంటనే స్పందించిన పోలీసులు. పుషప్స్ అయితే బాగానే కొట్టావ్.. మరి, మా రివార్డు వద్దా అంటూ జరిమానా చలానా పంపించారు. దానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ''కొన్ని కొన్ని పుషప్ లు చట్టం కళ్లలో పడేలా చేస్తాయి. జర భద్రం'' అంటూ ట్వీట్ చేశారు. ఆ వీడియో తర్వాత ఓ సందేశాన్నీ ఇచ్చారు. ప్రస్తుతం ఉజ్వల్ యాదవ్ వీడియోతో పాటు యూపీ పోలీసుల ట్వీట్ కూడా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story