Yediyurappa: ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన యడియూరప్ప

Yediyurappa: బీజేపీ తరపున రాష్ట్రమంతా ప్రచారం చేస్తా

Dhatripriya
Published on: 30 March 2023 2:52 PM IST
Yediyurappa Announced That He Will Not Contest In Elections
X

Yediyurappa: ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన యడియూరప్ప

Yediyurappa: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తనకు ఇప్పటికే 80 ఏళ్లు దాటినందున ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశానని తెలిపారు. అయితే బీజేపీ తరపున తన ప్రచారాన్ని కొనసాగిస్తానని చెప్పారు. రాష్ట్రమంతా తిరిగి బీజేపీ గెలుపునకు కృషి చేస్తానన్నారు. ఈసారి భారీ మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు అవినీతిపరులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే 40శాతం కమీషన్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ని ఓటర్లు దూరంగా ఉంచుతారని ఎద్దేవా చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story