విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌.. హాజరైన పవార్, రాహుల్‌, కేటీఆర్, అఖిలేష్..

Yashwant Sinha: రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన విపక్షాలకు ధన్యవాదాలు

Jyothi
Updated on: 27 Jun 2022 2:04 PM IST
Yashwant Sinha Files Nomination for Presidential Polls
X

నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా

Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసేందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ మోడీకి స్వయంగా అందించారు. అభ్యర్థి యశ్వంత్ సిన్హాతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, సమాజ్‌వాది పార్టీ నాయకులు అఖిలేశ్ యాదవ్, డియంకె నాయకులు ఎ.రాజా, కాంగ్రెస్ నాయకులు ఫరూఖ్‌ అబ్ధుల్లా హాజరయ్యారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్రసమితి సంపూర్ణ మద్ధతు ఇస్తోందని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story