హ్యాట్సాఫ్.. భర్త కోసం మొసలితో పోరాడిన మగువ..!

Viral News: భర్తను మొసలి నోట కరుచుకుని వెళ్లడం చూసిన భార్య.. ప్రాణాలకు తెగించి మరీ ఆ మొసలితో పోరాడింది.

Arun Chilukuri
Published on: 13 April 2023 1:20 PM IST
Women Fight With Crocodile to Save Her Husbands Life
X

హ్యాట్సాఫ్.. భర్త కోసం మొసలితో పోరాడిన మగువ..!

Viral News: భర్తను మొసలి నోట కరుచుకుని వెళ్లడం చూసిన భార్య.. ప్రాణాలకు తెగించి మరీ ఆ మొసలితో పోరాడింది. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో చంబల్ నదీ తీరంలో మంగళవారం చోటుచేసుకుంది. మండరాయల్ సబ్ డివిజన్ పరిధిలో నివాసం ఉండే బనీసింగ్ మీనా ఓ మేకల కాపరి. అతని భార్య విమలాబాయ్. మంగళవారం.. ఇద్దరు కలిసి మేకలను మేపేందుకు చంబల్ నది తీర ప్రాంతానికి వెళ్లారు. అనంతరం వాటికి నీళ్లు తాగించేందుకు బనీసింగ్ మీనా.. నది వద్దకు వెళ్లాడు. తనకూ దాహంగా ఉండటంతో నీటికి దగ్గరగా వెళ్లి రెండు దోసిళ్లతో నీరు తాగబోయాడు. అంతే.. నీటి మాటు నుంచి ఒక్క ఉదుటున లేచి బనీసింగ్‌పై దాడి చేసిన మొసలి అతడి కాలిని నోట కరచి నీటి లోపలికి లాక్కొని పోయేందుకు ప్రయత్నించింది.

అనూహ్యమైన ఘటనతో బిత్తరపోయిన బనీసింగ్‌ గట్టిగా కేకలు వేశాడు. కాస్త దూరంలో ఉన్న విమలాబాయి భర్త కేకలు విని పరుగున వచ్చింది. అక్కడి పరిస్థితిని చూసి వెంటనే తేరుకొన్న ఆమె.. నదికి దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై పదే పదే బాదింది. దీంతో ఆ మొసలి అతడ్ని వదిలేసి లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భార్యభర్తలిద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. తన భార్య చేసిన సాహసం ఎన్నడు తీసుకొనటువంటి ఓ గొప్ప బహుమతి అని బనీసింగ్ అన్నారు. అలాగే తన భర్తను మొసలి కరచినప్పుడు తన జీవితం గురించి ఆలోచించలేదని.. తన ప్రాణాలు పోయిన కూడా భర్తను ఎలాగైనా కాపాడాలని అనుకున్నానని మలాబాయ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Husband's

Arun Chilukuri

Arun Chilukuri

Next Story