దారుణం.. మహిళ తల గాయానికి కండోమ్‌ ప్యాక్‌తో డ్రెస్సింగ్..

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Updated on: 20 Aug 2022 5:16 PM IST
Womans Head Wound Dressed With Condom Pack in Madhya Pradesh
X

దారుణం.. మహిళ తల గాయానికి కండోమ్‌ ప్యాక్‌తో డ్రెస్సింగ్..

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తలకు గాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన మహిళకు కండోమ్‌ ప్యాక్‌తో కట్టుకట్టారు. అనంతరం ఆమెను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రమైన గాయమవ్వడంతో రేష్మాబాయి అనే మహిళను మోరెనాలోని పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్య సిబ్బంది దూదితోపాటు కండోమ్‌ ప్యాక్‌ రేపర్‌తో సహా ఆమె తలకు కట్టుకట్టారు. తర్వాత మహిళ గాయం తీవ్రమవ్వడంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అయితే అక్కడ గాయానికి చికిత్స అందించే క్రమంలో అక్కడి వైద్యులు కట్టు విప్పారు. అయితే దూదితోపాటు కండోమ్‌ ప్యాక్‌ రేపర్‌తో కట్టుకట్టడం చూసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. తలకు తీవ్ర గాయమైన ఆ మహిళకు చికిత్సలో నిర్లక్ష్యం వహించి బ్యాండేజీకి బదులుగా కండోమ్‌ ప్యాక్‌ రేపర్‌తో కట్టుకట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డ్రస్సన్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story