Patna: పాట్నాలో ఓ యువతి హల్‌చల్‌

Patna: బీహార్‌లోని పాట్నాలో ఓ యువతి హల్‌చల్‌ చేసింది.

Arun Chilukuri
Published on: 6 May 2021 4:10 PM IST
Woman violates Lockdown Norms in Patna
X

Patna: పాట్నాలో ఓ యువతి హల్‌చల్‌

Patna: బీహార్‌లోని పాట్నాలో ఓ యువతి హల్‌చల్‌ చేసింది. హెల్మెట్‌ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులపై చిందులేసింది. లాక్‌డౌన్‌ సమయంలో బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. సెకండ్‌ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారికి సేవ చేయడం కోసమే బయటకు వచ్చానని తెలిపింది. ఆటో డ్రైవర్లకు ఫుడ్‌ సప్లై చేయడానిక వచ్చిన తనను ఆపడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా కొవిడ్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు తెగేసి చెప్పడంతో వారి మాటను లెక్కచేయకుండా వాగ్వాదానికి దిగింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story