శభాష్ డ్రైవరన్నా.. ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన క్యాబ్ డ్రైవర్

Atal Setu: ముంబై అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి ఆత్మహత్యకు యత్నించిన మహిళను క్యాబ్ డ్రైవర్ కాపాడారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 Aug 2024 10:58 AM IST
Woman Tries To Jump Off Mumbais Atal Setu, Saved By Driver
X

శభాష్ డ్రైవరన్నా.. ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన క్యాబ్ డ్రైవర్

Atal Setu: ముంబై అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి ఆత్మహత్యకు యత్నించిన మహిళను క్యాబ్ డ్రైవర్ కాపాడారు. ఓ మహిళ అటల్ సేతు బ్రిడ్జిపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అది గమనించి క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకోగానే... వారిని చూసి దూకే ప్రయత్నం చేసింది.

మహిళ దూకుతుండగా డ్రైవర్ పట్టుకున్నాడు. ఆలోగా పోలీసులు వచ్చి ఆమెను రక్షించారు. అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story