Viral News: చూడ్డానికి అమాయ‌కంగా ఉంది క‌దూ.. ఏం చేసిందో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అంతే

Viral News
x

Viral News: చూడ్డానికి అమాయ‌కంగా ఉంది క‌దూ.. ఏం చేసిందో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అంతే

Highlights

Viral News: ప్ర‌స్తుతం స‌మాజంలో మోసాలు నిత్య‌కృత్యంగా మారిపోయాయి. ఎలాగైనా స‌రే డ‌బ్బులు సంపాదించాల‌నే వారి సంఖ్య పెరుగుతోంది.

Viral News: ప్ర‌స్తుతం స‌మాజంలో మోసాలు నిత్య‌కృత్యంగా మారిపోయాయి. ఎలాగైనా స‌రే డ‌బ్బులు సంపాదించాల‌నే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకోసం ఎంత‌కైనా దిగ‌జార‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ప‌క్క‌వారిని ఎలాగైనా మోసం చేసి బ‌తికేయాల‌నుకుంటున్నారు. పైన ఫొటోలో అమాయ‌కంగా క‌నిపిస్తున్న అమ్మాయి కూడా అదే జాబితాలోకి వ‌స్తుంది. ఇంత‌కీ ఆమె ఏం చేసింద‌నేగా.?

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహారాజ్‌గంజ్‌కు చెందిన అనురాధ పాశ్వాన్ (వయసు 23 సంవత్సరాలు), ఒకప్పుడు ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న ఆమె, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నగరంలో మకాం మార్చింది. అక్కడ ఆమె ఒక పెళ్లిళ్ల ముఠాలో చేరి, యువకులను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.

వీళ్లు ఏం చేశారంటే.?

పెళ్లి కావాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్న యువకులను ఎంచుకుని, తమ దగ్గర మంచి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫోటో చూపిస్తూ ముఠా సభ్యులు ముందుకు వచ్చేవారు. నమ్మిన వారు పెళ్లికి అంగీకరించాక, స్థానిక కోర్టులో చట్టబద్ధంగా వివాహం జరిపించేవారు. అనంతరం పెళ్లి కుదిర్చినందుకు వారివద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవారు.

అనురాధ, పెళ్లి అయిన ఇంట్లో కొన్ని రోజులు గడిపిన తర్వాత, సరైన సమయాన్ని చూసుకుని బంగారం, నగదు, ల్యాప్‌టాప్‌లు వంటి విలువైన వస్తువులతో చెప్పా పెట్ట‌కుండా పారిపోయేది. ఇలా ఆమె వివిధ రాష్ట్రాల్లో 25 మంది యువకులను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే.?

ఈ మోసానికి తెరలేపిన సంఘటన మే 3న చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనురాధతో కోర్టు వివాహం జరిగిన 12 రోజుల్లోనే ఆమె విలువైన వస్తువులతో మాయమైపోయిందని ఆయన ఆరోపించారు. ఈ సంబంధం కోసం శర్మ, సునీత, పప్పు మీనా అనే ఇద్దరు మధ్యవర్తులకు రూ. 2 లక్షలు చెల్లించినట్టు వెల్లడించాడు.

సినిమా స్టైల్‌లో ఆప‌రేష‌న్ చేప‌ట్టిన పోలీసులు

దీని వెన‌కాల పెద్ద మోసం ఉందని అనుమానించిన పోలీసులు, ఓ కానిస్టేబుల్‌ను పెళ్లికొడుకుగా మారుస్తూ అండర్‌కవర్‌ ఆపరేషన్ చేపట్టారు. ముఠా సభ్యులతో డీలింగ్‌ జరిపిన కానిస్టేబుల్‌కు అనురాధ ఫోటో పంపించారు. చిరునామా సేకరించి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించాడు. ఆ ఆధారంగా పోలీసులు రెయిడ్‌ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే వ్యక్తులు కూడా కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories