మాయలేడి.. ఐదుగురిని పెళ్లి చేసుకుని.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..

Woman Married and Left Five People in Karur
x

మాయలేడి.. ఐదుగురిని పెళ్లి చేసుకుని.. ఆరో పెళ్లికి రెడీ అవుతుండగా..

Highlights

Marriage: ఐదుగురిని పెళ్ళాడి లక్షలాది రూపాయల నగదు, నగలను దోచుకున్న తమిళనాడులోని కరూరుకు చెందిన సౌమ్యా అలియాస్‌ శబరి (28) అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు.

Marriage: ఐదుగురిని పెళ్ళాడి లక్షలాది రూపాయల నగదు, నగలను దోచుకున్న తమిళనాడులోని కరూరుకు చెందిన సౌమ్యా అలియాస్‌ శబరి (28) అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కరూరు మారియమ్మన్‌ కోవిల్‌ ప్రాంతానికి చెందిన ఆ యువతి తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని రామనాధపురంలోని ఓ ల్యాడ్జీలో ఉండేది. ఈ క్రమంలో కొంతకాలానికి ఆమెకు రాజేష్ అనే పోలీసుతో పరిచయం అయింది. వారి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పెళ్లి చేసుకున్నారు. భర్త పోలీసు కావడంతో అతడి పలుకుబడిని ఉపయోగించుకుని మోసాలకు తెరతీసింది. భర్త వద్దనున్న డబ్బును కూడా కాజేసింది. ఆపై అతడిని వదిలించుకుంది. ఆ డబ్బుతో రూ. 7 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసింది.

తనను మోసం చేసిన సౌమ్యపై రాజేష్ కేసు పెట్టడంతో అరెస్ట్ అయి జైలుకెళ్లింది. బెయిలుపై బయటకు వచ్చిన ఆమె మళ్లీ మోసాలకు తెరతీసింది. రామనాథపురానికి చెందిన సతీశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల తర్వాత అతడిని కూడా వదిలేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిగా ఐదుగురిని పెళ్లాడింది. తాజాగా ఆటోడ్రైవర్‌ను ఆరో పెళ్లి చేసుకోవడానికి సౌమ్య సిద్ధమైందన్న విషయం బాధితులకు తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారంతో వారు సౌమ్యను పట్టుకున్నారు. ఇప్పటివరకు సౌమ్య మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories