రెచ్చిపోయిన లిక్కర్ మాఫియా.. మహిళా కానిస్టేబుల్ మృతి, పలువురికి గాయాలు

Woman Constable killed After she Was Run Over by a Vehicle in Bihar Jehanabad
x

రెచ్చిపోయిన లిక్కర్ మాఫియా.. మహిళా కానిస్టేబుల్ మృతి, పలువురికి గాయాలు

Highlights

Bihar: బీహార్‌లో లిక్కర్ మాఫియా రెచ్చిపోయింది.

Bihar: బీహార్‌లో లిక్కర్ మాఫియా రెచ్చిపోయింది. నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారంతో జహనాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మూకుమ్మడిగా పోలీసులపై దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లే చితకబాదడంతో ఏం జరుగుతుందో అర్థంకాని పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక మహిళా కానిస్టేబుల్ మృతి చెందడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారింది. దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories