New Labor Code: కొత్త లేబర్ కోడ్ అమలు కష్టమేనా.. సెలవుల విషయంలో తర్జనభర్జన..!

Will it be difficult to implement the new labor code
x

New Labor Code: కొత్త లేబర్ కోడ్ అమలు కష్టమేనా.. సెలవుల విషయంలో తర్జనభర్జన..!

Highlights

New Labor Code: కొత్త లేబర్ కోడ్ అమలు కష్టమేనా.. సెలవుల విషయంలో తర్జనభర్జన..!

New Labor Code: జూలై 1 నుంచి అమలు కానున్న కొత్త లేబర్ కోడ్ ప్రస్తుతం నిలిచిపోయింది. కొత్త లేబర్ కోడ్‌ను అన్ని రాష్ట్రాలు ఏకకాలంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ పనులు జరగలేదు. 23 రాష్ట్రాలు కొత్త లేబర్ కోడ్ చట్టాన్ని ఆమోదించాయి. కానీ మిగిలిన రాష్ట్రాలు ఇంకా ఆమోదించలేదు. నాలుగు ప్రధాన మార్పుల కోసం ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌ను తీసుకొచ్చింది.

వారానికి మూడు రోజులు సెలవు

కొత్త వేతన నియమావళి ప్రకారం జీతభత్యాలు వారానికి నాలుగు రోజులు పని, మూడు సెలవులు ఉండాలి. అయితే దీని అమలు తర్వాత ఉద్యోగులు కార్యాలయంలో ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. వారంలో మూడు రోజులు సెలవులు రావడంతో రోజూ 12 గంటలు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి 5 రోజులు 8 నుంచి 9 గంటల పాటు కార్యాలయంలో పనిచేయాల్సి వస్తోంది. కొత్త లేబర్ కోడ్‌లు వేతనం, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రతకు సంబంధించినవి.

సెలవుల మార్పు

కొత్త లేబర్ కోడ్‌లో సెలవులకు సంబంధించి ప్రధాన మార్పు చేశారు. ప్రస్తుతం ఒక ఉద్యోగి ఏ సంస్థలోనైనా దీర్ఘకాలిక సెలవు తీసుకోవాలంటే ఏడాదిలో కనీసం 240 రోజులు పని చేయాల్సి ఉంటుంది. కానీ కొత్త లేబర్ కోడ్‌లో దీన్ని 180 రోజులకు (6 నెలలు) కుదించారు. కొత్త వేతన కోడ్‌లో ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత కంపెనీలు రెండు రోజుల్లోగా సెటిల్‌మెంట్ చేయాలి. ప్రస్తుతం ఈ పని చేసేందుకు కంపెనీలు 30 నుంచి 60 రోజులు తీసుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories