హైడ్రాక్సి క్లోరోక్విన్..ఎందికింత డిమాండ్?

హైడ్రాక్సి క్లోరోక్విన్..ఎందికింత డిమాండ్?
x
representative image
Highlights

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ డిమాండ్ ని పెంచేసింది. మలేరియా చికిత్సకు వాడే ఈ ఔషధం కరోనా వైద్యానికి ఉపయోగపడుతోందని చాలా...

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ డిమాండ్ ని పెంచేసింది. మలేరియా చికిత్సకు వాడే ఈ ఔషధం కరోనా వైద్యానికి ఉపయోగపడుతోందని చాలా దేశాలు నమ్ముతున్నాయి. దీంతో ఇండియా నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి భారీగా పెరిగింది. అసలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ప్రపంచ దేశాలు భారత్ వైపే ఎందుకు చూస్తున్నాయి..? ఇండియాలోనే ఈ వేక్సిన్ ఎక్కువగా ఎందుకు ఉత్పత్తి అవుతోంది..?

ప్రపంచమంతా కరోనా మహమ్మారి మారణహోమం సృష్టిస్తున్న వేళ హైడ్రాక్సీ క్లోరోక్విన్ సంజీవనిగా మారింది. మాకంటే మాకు కావాలంటూ పదుల కొద్దీ దేశాలు ఈ వేక్సిన్ కోసం పోటీ పడటంతో అందరి దృష్టీ భారత్ వైపే పడింది. అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఎగబడుతున్నాయి. ఇందుకు కరోనా చికిత్సలో ఆ వేక్సిన్ ఇస్తోన్న సానుకూల ఫలితాలే కారణం.

1918లో స్పానిష్ ఇన్ ఫ్లుయంజా తర్వాత అంతటి ప్రభావాన్ని చూపిన మరో వైరస్ మలేరియా. 1928లో ప్రారంభమైన ఈ మహమ్మారి మానవాళిపై దాడి చేసింది. దాంతో మలేరియాను ఆపేందుకు అప్పట్లో క్వినైన్ అనే సించోనా చెట్ట బెరడును ఔషధంగా వాడారు. అయితే 1930లో మలేరియా అనేక దేశాలకు వ్యాపించటంతో భారీగా మందును తయారు చేశారు. దానికి క్లోరోక్విన్ అనే పేరు పెట్టారు.

క్లోరోక్విన్ ప్రతికూల ప్రభావాలు కూడా చూపటంతో దానిని మరింత మెరుగుపరిచి 1950లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను తయారు చేశారు. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మలేరియాకే కాక కీళ్ల నొప్పులు, లూపస్ లాంటి సమస్యలకు కూడా విరుగుడుగా పనిచేసింది. అభివృద్ది చెందిన దేశాల్లో మలేరియా తక్కువ ప్రభావం చూపటంతో కొద్ది రోజులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీ ఆపేశారు. ఫార్మా కంపెనీలకు గిరాకీ లేక 1980 నుంచి ఉత్పత్తి నిలిపేశాయి.

అభివృద్ధి చెందిన దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో అవసరం తగ్గినా చిన్న దేశాల్లో మలేరియా ప్రభావం తగ్గలేదు. దాంతో చిన్న, అభివృద్ధి చెందుతోన్న దేశాలకు అవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను భారత్, చైనాలే ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో 70 శాతం అవసరాలను ఇండియా తీరుస్తోంది. తాజాగా కరోనాపై హైడ్రాక్సీ క్లోరోక్విన్ సానుకూల ఫలితం చూపిస్తుండటంతో అందరి దృష్టి భారత్ వైపు పడింది.

ఇక ప్రపంచ దేశాల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ చర్చనీయంగా మారిన వేళ కరోనా చికిత్సలకు ఈ వేక్సిన్ సరైందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వేక్సిన్ వినియోగంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాలు మాత్రం సానుకూల ఫలితాలిస్తున్నట్లు చెబుతున్నాయి. అసలు హైడ్రాక్సి క్లోరోక్విన్ కరోనాపై సమర్థవంతంగా పోరాడుతుందా..? ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?

కరోనా చికిత్స కోసం చేసిన ప్రయోగాల్లో కొవిడ్ కు కారణమయ్యే వైరస్ కు యాంటీగా పనిచేసే లక్షణాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ లో ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఈ పరిశోధన ప్రకారం కణాల్లో వైరస్ ప్రవేశించకుండా వాటి వృద్ధిని నివారించగలిగింది హైడ్రాక్సీ క్లోరోక్విన్. అయితే పరిశోధనలు ప్రారంభదశలో ఉండగానే చాలా వరకు హాస్పిటల్స్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడటం మొదలు పెట్టారు. మార్చి 28న FDA కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా పెంచాలని కోరింది. కానీ పూర్తిస్థాయిలో ఇది కొవిడ్ పై పోరాడుతుందని నిర్ధారించలేదు.

ఇక పరిశోధనల విషయానికొస్తే చైనా వంద మంది కరోనా పేషంట్లకు క్లోరోక్విన్ తో చికిత్స చేసింది. మిగిలిన వారితో పోలిస్తే క్లోరోక్విన్ తీసుకున్న వారి పరిస్థితి మెరుగుపడిందని అక్కడి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫాన్స్ లో 600 మందికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చి పరిశోధనలు జరిపారు. ఇందులో ఈ వేక్సిన్ ఇచ్చిన తొలి 26 మందిలో ఆరుగురికి సానుకూల ఫలితం వచ్చింది. వారు త్వరగా డిశ్చార్జ్ అవటమే కాకుండా వారిలో వైరస్ తీవ్రత తగ్గేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉపయోగపడినట్లు తెలిపారు. అటు అమెరికాలోనూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ సానుకూల ఫలితాలనిచ్చింది.

స్వీడన్ లో కొవిడ్ చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడటంతో ప్రతీ వంద మందిలో ఒకరికి గుండె, కిడ్నీలపై దుష్ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇండియాలో అజిత్రోమైసిన్ కలిపి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వినియోగిస్తుండగా 15 ఏళ్ల లోపు పిల్లలు, అరవై ఏళ్లు దాటిన పెద్దలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఇవ్వొద్దని ICMR ఆదేశించింది. బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో మాత్రం దీనిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లు హార్ట్ ఎటాక్ లాంటి తీవ్రమైన దుష్ర్పభవాలు చూపే అవకాశం ఉన్నాయని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక చాలా వరకు పరిశోధనలు పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చాకే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వినియోగించటం మేలని చెబుతున్నాయి. కొద్దిమందిపై చేసిన ప్రయోగాలతో నిర్ధారణకు రావొద్దని సూచిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories